మాస్ మహారాజా రవితేజ తాజాగా టైగర్ నాగేశ్వరరావు అనే సినిమాలో హీరోగా నటించిన విషయం మన అందరికీ తెలిసిందే. ఈ సినిమా టైగర్ నాగేశ్వరరావు అనే బందిపోటు దొంగ జీవిత కథ ఆధారంగా రూపొందింది. దానితో ఈ మూవీ లో రవితేజ కూడా బందిపోటు దొంగ పాత్రలో కనిపించబోతున్నాడు. ఈ సినిమాను అక్టోబర్ 20 వ తేదీన తెలుగు , తమిళ , కన్నడ , మలయాళ , హిందీ భాషలలో విడుదల చేయనున్నారు. ఇకపోతే ఇప్పటికే ఈ మూవీ బృందం వారు ఈ సినిమాకు సంబంధించిన ఫ్రీ రిలీజ్ బిజినెస్ ను కూడా క్లోజ్ చేశారు. ఈ సినిమాకు ప్రపంచ వ్యాప్తంగా జరిగిన ఫ్రీ రిలీజ్ బిజినెస్ వివరాలను తెలుసుకుందాం.

మూవీ కి నైజాం ఏరియాలో 8.60 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ జరగగా ... సీడెడ్ ఏరియాలో 5.40 కోట్లు ... ఆంధ్ర ఏరియాలో 17 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది. మొత్తంగా ఈ సినిమాకు రెండు తెలుగు రాష్ట్రాల్లో కలిపి 31 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది. ఈ మూవీ కి కర్ణాటక మరియు రెస్ట్ ఆఫ్ ఇండియాలో కలిపి 4 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ జరగగా ... ఓవర్ సీస్ లో 3 కోట్ల ప్రీ రిలీజ్ చేసిన జరిగింది. మొత్తంగా ఈ సినిమాకు వరల్డ్ వైడ్ గా 37.50 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ జరగగా ... ఈ మూవీ 38.50 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో బాక్స్ ఆఫీస్ బరిలోకి దిగబోతోంది.

ఇకపోతే ఈ మూవీ కి వంశీ దర్శకత్వం వహించగా ... నుపూరు సనన్ , గాయత్రి భరద్వాజ్ లు ఈ మూవీ లో రవితేజ సరసన హీరోయిన్ లుగా నటించారు. జీవీ ప్రకాష్ కుమార్ సంగీతం అందించిన ఈ సినిమాలో రేణు దేశాయ్ , మురళి శర్మ , అనుపమ్ కేర్ ముఖ్య పాత్రలో నటించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: