విజయ్ దేవరకొండ హీరోగా శాలిని పాండే హీరోయిన్ గా రూపొందిన అర్జున్ రెడ్డి మూవీ తో దర్శకుడుగా తన కెరీర్ ను మొదలు పెట్టిన సందీప్ రెడ్డి వంగ గురించి ప్రత్యేకంగా ఇండియన్ సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. అర్జున్ రెడ్డి మూవీ అదిరిపోయే రేంజ్ విజయాన్ని అందుకొని భారీ కలక్షన్ లను వసూలు చేసిన విషయం మనకు తెలిసిందే. ఇలా ఈ మూవీ అద్భుతమైన విజయం సాధించడంతో ఇదే సినిమాను హిందీలో షాహిద్ కపూర్ హీరోగా కియారా అద్వానీ హీరోయిన్ గా కబీర్ సింగ్ పేరుతో సందీప్ రెడ్డి వంగ రీమేక్ చేశాడు.

మూవీ హిందీ సినీ ప్రేమికులను కూడా అద్భుతమైన రీతిలో అలరించింది. అలాగే భారీ కలెక్షన్ లను వసూలు చేసి హిందీ బాక్స్ ఆఫీస్ దగ్గర బ్లాక్ బాస్టర్ విజయాన్ని నమోదు చేసుకుంది. ఇకపోతే ప్రస్తుతం ఈ దర్శకుడు హిందీ సినీ పరిశ్రమలో టాప్ హీరోలలో ఒకరు అయినటువంటి రన్బీర్ కపూర్ హీరోగా రష్మిక మందన హీరోయిన్ గా యానిమల్ అనే మూవీ ని రూపొందిస్తున్నాడు. ఈ మూవీ ని డిసెంబర్ 1 వ తేదీన విడుదల చేయనున్నారు. ఇకపోతే అర్జున్ రెడ్డి ... కబీర్ సింగ్ మూవీ లు బ్లాక్ బాస్టర్ విజయాలు సాధించడం ఆ మూవీ ల తర్వాత సందీప్ దర్శకత్వం వహించిన సినిమా కావడంతో యానిమల్ మూవీ పై ఇండియా వ్యాప్తంగా సినీ ప్రేమికుల్లో భారీ అంచనాలు ఉన్నాయి.

 ఈ మూవీ ని తెలుగు , తమిళ , కన్నడ , మలయాళ , హిందీ భాషలలో ఒకే సారి విడుదల చేయనున్నారు. ఇకపోతే తాజాగా ఈ మూవీ కి సంబంధించిన ఓ వార్త వైరల్ అవుతుంది. అసలు విషయం లోకి వెళితే ... ఈ మూవీ బృందం వారు ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన రన్ టైమ్ ను లాక్ చేసినట్లు ఈ మూవీ ఏకంగా మూడు గంటల పది నిమిషాల రన్ టైమ్ తో ప్రేక్షకుల ముందుకు రానున్నట్లు ఓ వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఇకపోతే ఈ వార్తకు సంబంధించి ఇప్పటి వరకు ఎలాంటి అధికారిక ప్రకటన కూడా వెలువడలేదు.

మరింత సమాచారం తెలుసుకోండి: