దర్శక, నిర్మాత రాంగోపాల్ వర్మకు, నాకు మధ్య డబ్బుల బాకీ యుద్ధం జరుగుతుంటే, మధ్యలో వై.ఎస్.ఆర్. పార్టీ వాళ్లు ఎందుకు జోక్యం చేస్తుకుంటున్నారని సీనియర్ నిర్మాత నట్టి కుమార్ ప్రశ్నించారు.శనివారం హైదరాబాద్ లో ఏర్పాటు చేసిన ప్రెస్ మీట్లో ఆయన మాట్లాడారు."వర్మ నాకు డబ్బులు ఇవ్వాల్సి ఉంది. అందుకు ఆయన నాకు బ్యాంకు చెక్కులు కూడా ఇచ్చారు. అయితే అవి బౌన్స్ అయ్యాయి కూడా. వాటి గురించి చాలాకాలంగా వర్మను ప్రశ్నిస్తుంటే ఇదిగో, అదిగో అంటూ సరిగా జవాబు చెప్పడం లేదు..అయన ఇచ్చిన హామీ ప్రకారమే తను తీసిన లేదా డైరెక్షన్ చేసినా ఏ సినిమాను అయినా విడుదలను అడ్డుకునే హక్కు నాకుంది.

 ఈ నేపథ్యంలో అయన నాకు బాకీ ఉన్న డబ్బులు పూర్తిగా వచ్చేంతవరకు "వ్యూహం" సినిమానే కాదు ఆయన నుంచి రాబోయే ఏ సినిమాను అయినా విడుదలను అడ్డుకుంటాను. వాస్తవానికి వర్మకు, నాకు మధ్య నడుస్తున్న బాకీ యుద్దానికి, వై.ఎస్.ఆర్. పార్టీకి సంబంధం ఏంటి?. నారా చంద్రబాబు నాయుడు లాంటి పెద్ద మనిషిని అక్రమంగా అరెస్ట్ చేయడాన్ని ఖండించి, కొన్ని వీడియోలు తెలుగుదేశం పార్టీకి అనుకూలంగా, వై.ఎస్.ఆర్ సీపీ నాయకులకు వ్యతిరేకంగా పెడుతున్నానని నా మీద ఏపీలోని అధికార వై.ఎస్.ఆర్ సీపీ ప్రభుత్వం కక్షకట్టినట్లు జరుగుతున్న పరిణామాలు తేటతెల్లం చేస్తున్నాయి. పోలీస్ కమీషనర్ కార్యాలయానికి చెందిన పోలీసులు రెండు రోజులుగా నాకు స్వయంగా ఫోన్లు చేసి మరీ నాకు ఎక్కడ ఆస్తులు ఉన్నాయి. నా ఇతర వివరాలు సేకరిస్తున్నారు. ఏ తప్పు చేయని నేను దేనికి భయపడాలి. అయినా భయపడే తత్త్వం నాది కాదు. ఏ కేసులు నాపై పెట్టినా వాటిని ఎదుర్కోగలను. అయినా చంద్రబాబునాయుడు అంత పెద్ద మనిషినే అరెస్ట్ చేసి, 55 రోజులు జైలులో పెట్టించిన వారికి నేను ఒక లెక్కనా!.

గత నాలుగున్నరేళ్లుగా వై.ఎస్.ఆర్ సీపీకి సానుభూతిపరుడిగా తెలుగు సినీ పరిశ్రమ తరపున మద్దతుగా,నిలిచాను. అయినప్పటికీ తనకు కనీస గౌరవం వారి నుంచి రాకపోవడంతో ఆ పార్టీ నుంచి బయటకు వచ్చేశాను అదే సమయంలో మాజీ ముఖ్యమంత్రి, తెలుగు దేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు లాంటి పెద్ద మనిషిని అక్రమంగా అరెస్ట్ చేయడం నాకెంతో భాధను కలిగించడంతో దానిని ఖండించాను. కష్టం కాలంలో వారి కుటుంబానికి సపోర్ట్ చేయడం జరిగింది. గత నాలుగున్నరేళ్లలో నాపై ఎలాంటివి కనిపించలేదా? ఇప్పడు తెలుగుదేశంకు మద్దతు పలుకుతున్నానని, "వ్యూహం " సినిమాను అడ్డుకుంటున్నానని నా గురించి పోలీసులు వివరాలు రాబడుతున్నారు. అయినా నేను లీగల్ గానే పోరాటం చేస్తాను, నా డబ్బులు పూర్తిగా వచ్చేంతవరకు వర్మ సినిమాలను రిలీజ్ లను అడ్డుకుంటేనే ఉంటాను" అని అన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: