టాలీవుడ్ ఇండస్ట్రీ లో సూపర్ క్రేజ్ ఉన్న యువ దర్శకులలో తరుణ్ భాస్కర్ ఒకరు. ఈయన పెళ్లి చూపులు మూవీ తో దర్శకుడుగా తన కెరీర్ ను ప్రారంభించాడు. ఈ మూవీ మంచి విజయం సాధించడం మాత్రమే కాకుండా ఎన్నో పురస్కారాలను కూడా అందుకుంది. ఇక ఈ సినిమా తర్వాత ఈయన ఈ నగరానికి ఏమైంది అనే మరో యూత్ ఫుల్ ఎంటర్టైనర్ మూవీ కి దర్శకత్వం వహించాడు. ఈ మూవీ మంచి విజయం సాధించడంతో ఈ దర్శకుడికి అద్భుతమైన క్రేజ్ లభించింది. ఇక ఆ తర్వాత ఈయన చాలా సంవత్సరాలు గ్యాప్ తీసుకొని తాజాగా కీడా కోలా అనే క్రైమ్ కామెడీ జోనర్ కు సంబంధించిన మూవీ ని రూపొందించాడు.

మూవీ నవంబర్ 3 వ తేదీన థియేటర్ లలో విడుదల అయింది. ఇకపోతే పెళ్లి చూపులు ... ఈ నగరానికి ఏమైంది లాంటి రెండు వరస విజయాల తర్వాత తరుణ్ దర్శకత్వం వహించిన మూవీ కావడంతో ఈ సినిమాపై టాలీవుడ్ సినీ ప్రేమికులు మంచి అంచనాలు పెట్టుకున్నారు. అలా ఈ సినిమాపై ప్రేక్షకుల్లో మంచి అంచనాలు ఉన్న కారణంగా ఈ మూవీ కి ప్రపంచ వ్యాప్తంగా మంచి ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది. ఈ మూవీ కు వరల్డ్ వైడ్ గా 8.5 కోట్ల ప్రి రిలీజ్ బిజినెస్ జరగగా ఈ మూవీ 9 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో బాక్స్ ఆఫీస్ బారిలోకి దిగింది. ఇకపోతే ఈ సినిమా కనుక ప్రపంచ వ్యాప్తంగా 9 కోట్ల షేర్ కలక్షన్ లను రాబట్టినట్లు అయితే బ్రేక్ ఈవెన్ ఫార్మల్ కంప్లీట్ చేసుకుని క్లీన్ హీట్ గా నిలుస్తుంది. మరి ఈ సినిమా ఏ స్థాయి కలెక్షన్ లను బాక్స్ ఆఫీస్ దగ్గర రాబట్టి ఏ రేంజ్ విజయాన్ని అందుకుంటుందో తెలియాలి అంటే మరి కొంత కాలం వేచి చూడాల్సిందే.


మరింత సమాచారం తెలుసుకోండి: