సాధారణంగా బాలీవుడ్ లో కొంతమంది స్టార్ సెలబ్రిటీలు ఏదైనా పండుగ వచ్చిందంటే చాలా తమ తరఫున ఇండస్ట్రీలో ఉన్న వాళ్ళందరికీ ఆహ్వానం పంపి గ్రాండ్ గా పార్టీ ఇస్తూ ఉంటారు. అయితే ఇప్పుడు అలాంటి బాలీవుడ్ కల్చరల్ ఇప్పుడు టాలీవుడ్ కి కూడా చేరువయ్యింది. ఎక్కువగా మెగాస్టార్ చిరంజీవి అలాగే రామ్ చరణ్ ఇలాంటి పార్టీలు ఇస్తూ అందరినీ ఒకచోట కలుపుతూ ఉంటారు. ఈ క్రమంలోనే కొద్ది రోజుల క్రితమే దీపావళి పార్టీని గ్రాండ్గా నిర్వహించిన రామ్ చరణ్.. ఈ పార్టీకి సూపర్ స్టార్ మహేష్ బాబు, యంగ్ టైగర్ ఎన్టీఆర్, వెంకటేష్, నాగార్జున , అల్లు అర్జున్ తదితరులను ముఖ్య అతిథులుగా పిలవగా వీరంతా కూడా సతీసమేతంగా పార్టీకి హాజరయ్యారు.

ఇక వీళ్లంతా కలిసి దిగిన ఫోటోలు కూడా సోషల్ మీడియాలో భారీగా ట్రెండ్ అయ్యాయి. అందరూ కలిసి ఫోటోలు దిగారు. కానీ అల్లు అర్జున్ మాత్రం వెంకటేష్ తో తప్ప ఎవరితోనూ పెద్దగా కలవకపోవడం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. బన్నీకి రామ్ చరణ్ కాకుండా ఇండస్ట్రీలో మంచి స్నేహితులుగా ఎన్టీఆర్ , ప్రభాస్ నిలిచారు. ప్రభాస్ ఈ పార్టీకి రాలేదు. కానీ ఎన్టీఆర్ తో మాత్రం అల్లు అర్జున్ చాలా క్లోజ్ గా ఈ పార్టీలో మాట్లాడుతూ వచ్చాడు. మరోవైపు మహేష్ బాబు అల్లు అర్జున్ తో పెద్దగా మాట్లాడడానికి ఇష్టపడలేదు. బన్నీ మహేష్ బాబు తో మాట్లాడాలని చూసినా కూడా ఆశించిన రేంజ్ లో ఆయన నుంచి రెస్పాన్స్ రాలేదు.

మరోవైపు మహేష్ అల్లు అర్జున్ మధ్య కోల్డ్ వార్ నడుస్తోందని వార్త ఇండస్ట్రీలో ఎప్పటినుంచో నడుస్తోంది. ఇకపోతే సరిలేరు నీకెవ్వరు, అలా వైకుంఠపురం చిత్రాల మధ్య ఎప్పుడైతే క్లాష్ వచ్చిందో అప్పటినుంచి వీరిద్దరి మధ్య కోల్డ్ వార్ నడుస్తోందని వార్తలు వినిపిస్తున్నాయి. ఈ క్రమంలోనే మహేష్ బాబు అల్లు అర్జున్ తో మాట్లాడకపోవడానికి కారణం అని అందుకే అల్లు అర్జున్ దీనిని అవమానంగా భావిస్తున్నాడని సమాచారం. ఏది ఏమైనా చెర్రీ ఇచ్చిన పార్టీలో బన్నీ అవమానంగా ఫీల్ అవ్వడం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది.

మరింత సమాచారం తెలుసుకోండి: