ఇలా అన్నీ విషయాల్లో అర్థం చేసుకుంటూ సంసారం జీవితం ని కొనసాగిస్తున్న ఈ జంట డబ్బు విషయం లో మాత్రం చాలా స్ట్రిక్ట్ గా ఉంటారట. ఒకరి డబ్బు కోసం ఒకరు ఎదురు చూడరు.ఏదైనా చారిటీ చెయ్యాలన్నా, ఏదైనా కొనుక్కోవాలి అన్నా ఎవరి డబ్బులను వాళ్ళే ఉపయోగించుకుంటారట. విశేషం ఏమిటంటే ఇప్పటి వరకు రామ్ చరణ్ తన భార్య ఉపాసన అకౌంట్ లో ఎంత డబ్బులు ఉన్నాయి అనేది చూడలేదట. ఇదే ఇప్పుడు అందరికీ ఆశ్చర్యాన్ని కలిగిస్తున్న విషయం. ప్రతీ సందర్భంలోను ఒకే మాట ఒకే బాట లాగా జీవిత పయనం చేసిన ఈ జంట డబ్బు విషయం లో ఎందుకు అంత కచ్చితంగా ఉన్నారు అనేది అర్థం కానీ ప్రశ్న.
రామ్ చరణ్ పాన్ వరల్డ్ స్టార్, ఆయన రెమ్యూనరేషన్ ఒక్కో సినిమాకి వంద కోట్ల రూపాయలకు పైగానే ఉంటుంది. ఇక ఉపాసన 'అపోలో' హాస్పిటల్స్ కి చైర్మన్. ఈమె నెల ఆదాయం కూడా వందల కోట్లలోనే ఉంటుంది. ఇద్దరికీ కావాల్సినంత డబ్బులు అందుతున్నప్పుడు, ఒకరి డబ్బులతో ఒకరికి ఏమి సంబంధం ఉంటుంది అనేది అభిమానుల పాయింట్.వాళ్ళ పాయింట్ లో కూడా నిజం ఉంది కదా అని అంటున్నారు కొంతమంది నెటిజెన్స్. ఇకపోతే ప్రస్తుతం రామ్ చరణ్ సౌత్ ఇండియన్ సెన్సేషనల్ డైరెక్టర్ శంకర్ తో 'గేమ్ చేంజర్' అనే చిత్రం చేస్తున్నాడు. ఈ సినిమా వచ్చే ఏడాది విడుదల కాబోతుంది.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి