అయితే ప్రభాస్ కు పెరిగిపోతున్న క్రేజ్ చూసి ఇక బాలీవుడ్ డైరెక్టర్ కావాలనే ప్రభాస్ ను ఆది పురుష్ అనే మూవీతో నిండా ముంచేసాడు అంటూ కొన్ని విమర్శలు కూడా వచ్చాయి అని చెప్పాలి. అయితే ఇక ఇప్పుడు మరో హీరోకి సంబంధించి ఇలాంటి వార్తలే వస్తున్నాయి. ప్రభాస్ను ముంచేసినట్లుగానే ఇప్పుడు జూనియర్ ఎన్టీఆర్ ని కూడా బాలీవుడ్ డైరెక్టర్స్ ముంచేయబోతున్నారా ఏంటి అని చర్చ జరుగుతుంది. Yrf స్పై యూనివర్స్ లో భాగంగా వార్ 2 తెరకెక్కుతుంది. ఇందులో హృతిక్ రోషన్ తో పాటు టాలీవుడ్ హీరో జూనియర్ ఎన్టీఆర్ కూడా నటిస్తున్నాడు.
ఇక తారక్ బాలీవుడ్ ఎంట్రీ కోసం ఆయన అభిమానులు కూడా ఎంతో ఎదురు చూస్తున్నారు. అయితే కొంతమంది ఫ్యాన్స్ మాత్రం హృతిక్ రోషన్, తారక్ కలిసిన నటిస్తున్న వార్ 2 ఎలా ఉండబోతుందో అని కంగారు పడుతున్నారు. ఇందుకు కారణం కూడా లేకపోలేదు. రీసెంట్గా రిలీజ్ అయిన స్పై మూవీ సల్మాన్ టైగర్ 3 ఆశించిన స్థాయిలో ఆటలేదు. అప్పుడైతే బాలీవుడ్ లో యాక్షన్ సినిమాలను ఎగబడి చూసేవారు జనాలు. కానీ ఇప్పుడు మాత్రం టాలీవుడ్ డైరెక్టర్లు అంతకుమించిన యాక్షన్ సినిమాలతో బాలీవుడ్ ప్రేక్షకులను ఫిదా చేస్తున్నారు. దీంతో వార్ 2 తో తారక్ కి చేదు అనుభవం ఎదురు కాబోతుందేమో అని కొంతమంది అనుమాన పడుతున్నారు. ఏం జరుగుతుందో చూడాలి మరి.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి