అయితే సమంత ఫ్యాన్స్ కూడా దీనికి రీకౌంటర్స్ వేయకపోవడంతో నిజంగానే సమంత ఇండస్ట్రీ నుంచి వెళ్లిపోయారని, సినిమాలో నటించే ఆలోచన లేదని ఆమె పూర్తి ఫోకస్ అంతా తన ఆరోగ్యం మీద పెట్టినట్లుగా ఉందని, సోషల్ మీడియాకి కూడా దూరంగా ఉండాలనుకుంటున్నారని కామెంట్స్ ఎక్కువగా వినిపిస్తున్నాయి. సోషల్ మీడియాలో సమంత పై ఏవైనా రూమర్స్ వచ్చిన వెంటనే కౌంటర్స్ వేసే సమంత ఫ్యాన్స్ ఇప్పుడు మాట్లాడకపోవడంతో ఆమె నిజంగానే సినిమాలకు దూరమైందని వార్తలు వైరల్ అవుతున్నాయి . దీంతో సోషల్ మీడియాలో హీరోయిన్ సమంత పేరు మారుమ్రోగిపోతుంది.
ఓ విధంగా చెప్పాలంటే ఇది సమంత అభిమానులకు బ్యాడ్ న్యూస్ అని చెప్పాలి. విడాకుల తర్వాత సమంత వరుస సినిమాలతో చాలా బిజీ అయ్యారు. పాన్ ఇండియా స్థాయిలో సినిమాలు చేస్తూ టాప్ హీరోయిన్ గా పేరు సంపాదించుకున్నారు. కానీ ఆమెకు వచ్చిన మాయోసైటీస్ వ్యాధి కారణంగా సినిమాలకు కొంచెం బ్రేక్ ఇచ్చినట్లుగానే కనిపిస్తున్నారు. ఇక సోషల్ మీడియాలో సమంత ఫుల్ యాక్టివ్ గా ఉంటున్నారు. లేటెస్ట్ ఫోటోలతో మెస్మరైజ్ చేస్తున్నారు. విడాకుల తర్వాత సమంత గురించి ఏదో ఒక వార్త సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతూనే ఉంది.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి