ఎన్నో ఏళ్లుగా బుల్లితెరపై సక్సెస్ఫుల్గా రన్ అవుతున్న జబర్దస్త్ షో గురించి ప్రత్యేకంగా చెప్పినవసరం లేదు. ఇందులో భాగంగానే యాంకర్ రష్మీ సుడిగాలి సుధీర్ ఇద్దరు ప్రేమలో ఉన్నారు అని అందరూ అనుకుంటున్నారు. జబర్దస్త్ షోలో వీరిద్దరి కెమిస్ట్రీ అలా ఉంటుంది మరి. ఈ క్రమంలోనే రష్మి తో పెళ్లిపై షాకింగ్ కామెంట్స్ చేశారు సుడిగాలి సుదీర్. జబర్దస్త్ కామెడీ షో ఎందరో మందికి జీవితాన్ని ఇచ్చింది. దాని ద్వారా పాపులర్ అయిన వాళ్ళలో సుడిగాలి సుదీర్ కూడా ఒకరు అనసూయ మంచి గుర్తింపును ప్రస్తుతం సినిమాల్లో నటిస్తూ బిజీగా ఉన్నారు. ఈ క్రమంలోనే వీరిద్దరి కెమిస్ట్రీ చూసిన వారందరూ వీరిద్దరూ ఎప్పుడు ఇలాగే కలిసి ఉండాలని మళ్లీ కూడా చేసుకోవాలి అని డిమాండ్ చేస్తూ ఉంటారు

వారి అభిమానులు. అలా తరచూ రష్మితో బంధం పై సుడిగాలి సుధీర్ కి ప్రశ్నలు ఎదురవుతూనే ఉంటాయి. తాజాగా మరొకసారి ఇప్పుడు అలాంటి ప్రశ్న సుధీర్ కి ఎదురయింది. సుడిగాలి సుధీర్ ఈ విషయంపై స్పందిస్తూ షాకింగ్ ఆన్సర్ ని చెప్పాడు ప్రస్తుతం సుడిగాలి సుధీర్‌ నటించిన `కాలింగ్‌ సహస్త్ర` చిత్ర ట్రైలర్‌ ఈవెంట్‌ జరిగింది. ఇందులో రష్మితో పెళ్లి ఎప్పుడు ? అనే ప్రశ్న సుధీర్‌కి వచ్చింది. దీనికి ఆయన స్పందన టూ క్రేజీగా ఉంది. ఈ ప్రశ్న తనకు తరచూ ఎదురవుతూనే ఉందని తెలిపారు. అంతగా జనం మమ్మల్ని ఓన్‌ చేసుకున్నారని, అందుకు ధన్యవాదాలు తెలిపారు సుధీర్‌. అయితే రష్మితో కెమిస్ట్రీ, వగైరా అంతా స్క్రీన్‌ కోసం చేసిందే అని చెప్పారు.

పెళ్లి గురించి చెబుతూ, పెళ్లి అనేది మన చేతుల్లో లేదని తెలిపారు. ప్రస్తుతానికి సినిమాలపైనే తన ఫోకస్‌ ఉందని, పెళ్లి గురించి ఆలోచించడం లేదన్నారు. పెళ్లి అనేదే తన మైండ్‌ లో లేదని, నాకసలు మ్యారేజే వద్దు అంటూ స్టేట్‌మెంట్‌ ఇచ్చేశాడు. ఇప్పుడు హ్యాపీగా ఉన్నానని, కెరీర్‌,ఫ్యామిలీ అనే వేలో వెళ్తున్నా, ఒకవేళ దేవుడు అటు కాదు, ఇటూ కూడా అని పెళ్లి వైపు తిప్పితే చెప్పిలేను గానీ, ప్రస్తుతం తాను కంఫర్ట్ జోన్‌లో ఉన్నట్టు చెప్పారు. పొరపాటున ఏమైనా అయితే ఏం చేయలేనని తెలిపారు. అలా ప్రస్తుతం రష్మి తో తన పెళ్లిపై ఇన్ డైరెక్ట్ గా షాకింగ్ విషయాన్ని వెల్లడించాడు  సుధీర్. దీంతో ఆయన చేసిన కామెంట్లు ప్రస్తుతం సోషల్ మీడియా వేదికగా వైరల్ అవుతున్నాయి..!!

మరింత సమాచారం తెలుసుకోండి: