మోస్ట్ బ్యూటిఫుల్ నటీమణి రష్మిక మందన గురించి ప్రత్యేకంగా తెలుగు సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఈ బ్యూటీ నాగ శౌర్య హీరో గా వెంకీ కుడుముల దర్శకత్వంలో రూపొందిన ఛలో మూవీ తో తెలుగు తెరకు పరిచయం అయింది. ఈ మూవీ తో సూపర్ సక్సెస్ ను ఈ ముద్దుగుమ్మ అందుకుంది. ఇక ఆ తర్వాత వరుసగా ఈ బ్యూటీ కి తెలుగు లో అవకాశాలు దక్కాయి. అందులో భాగంగా ఈ నటి ఇప్పటివరకు తెలుగులో నటించిన సినిమాలలో చాలా వరకు అద్భుతమైన విజయాలను సాధించడంతో ఈ నటి ప్రస్తుతం టాలీవుడ్ ఇండస్ట్రీ లో టాప్ హీరోయిన్ లలో ఒకరిగా కెరీర్ ను కొనసాగిస్తుంది.  

ఇది ఇలా ఉంటే తాజాగా ఈ బ్యూటీ రన్బీర్ కపూర్ హీరోగా సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో రూపొందిన యానిమల్ అనే సినిమాలో హీరోయిన్ గా నటించింది. ఈ మూవీ ని డిసెంబర్ 1 వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా భారీ ఎత్తున థియేటర్ లలో విడుదల చేయనున్నారు. ఈ మూవీ విడుదల తేదీ దగ్గర పడడంతో ఈ మూవీ బృందం వారు ఇప్పటికే ఈ సినిమా ప్రమోషన్ లను మొదలు పెట్టారు. అందులో భాగంగా దేశ వ్యాప్తంగా ఈ చిత్ర బృందం ప్రమోషన్ లను నిర్వహిస్తోంది. ఈ సినిమా ప్రమోషన్ లలో రష్మిక కూడా చాలా యాక్టివ్ గా పాల్గొంటూ వస్తుంది. 

ఇకపోతే ఈ బ్యూటీసినిమా ప్రమోషన్ లకి అదిరిపోయే లుక్ లో ఉన్న డ్రెస్ లను ... శారీలను కట్టుకొని వస్తుంది. ఇక దానితో ఆ ఈవెంట్ కు సంబంధించిన కెమెరాలు అన్ని ఈ ముద్దుగుమ్మ వైపు తిరుగుతున్నాయి. ఇకపోతే తాజాగా ఈ బ్యూటీ యనిమల్ ప్రమోషన్ లలో భాగంగా గ్రీన్ కలర్ సారీ ని కట్టుకొని స్లీవ్ లెస్ బ్లౌజ్ ను ధరించి విచ్చేసింది. ఈ ముద్దుగుమ్మ కి సంబంధించిన ఈ ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో ఫుల్ గా వైరల్ అవుతున్నాయి.


మరింత సమాచారం తెలుసుకోండి: