శ్రీలీల కు అదృష్టం కలిసి రావడం లేదా అన్న సందేహాలు కొందరిలో ఉన్నాయి. రామ్ తో నటించిన ‘స్కంద’ మూవీ ఘోరమైన ఫ్లాప్ గా మారిన తరువాత వచ్చిన ‘భగవంత్ కేసరి’ ఏవరేజ్ హిట్ గా మారడంతో శ్రీలీల ఆశలకు గండి పడింది. లేటెస్ట్ గా విడుదలైన ‘ఆదికేశవ’ మూవీ ఫ్లాప్ కావడంతో వరస ఫ్లాప్ ల మధ్య ఈమె కెరియర్ సతమతమౌతోంది.దీనితో ఆమె హీరో నితిన్ తో నటిస్తున్న ‘ఎక్స్ ట్రా ఆర్డినరీ మేన్’ మూవీ పై మరింత ఆశలు పెట్టుకుంది. డిసెంబర్ రెండవ వారంలో రాబోతున్న ఈమూవీ ఫలితం నితిన్ కెరియర్ కు చాల కీలకంగా మారింది. ప్రస్తుతం ఇండస్ట్రీలో కొనసాగుతున్న క్రేజీ హీరోయిన్ శ్రీలీల నితిన్ సినిమాలో నటిస్తూ ఉండటంతో ఆమె నితిన్ తో కలిసి నటించిన ఈమూవీ బ్లాక్ బష్టర్ హిట్ అయితే బాగుండును అన్న భావనలో ఆమె ఉన్నట్లు సోషల్ మీడియా వర్గాలు ఊహాగానాలు చేస్తున్నాయి.ఈసినిమా ప్రమోట్ చేస్తూ ఒక మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో నితిన్ శ్రీలీల మ్యానియా పై కొన్ని కామెంట్స్ చేసినట్లు తెలుస్తోంది. దర్శకుడు వక్కంతం వంశీ నితిన్ పాత్ర పై పెట్టిన శ్రద్ధ శ్రీలీల పాత్ర పై ఉండదు అన్న స్పష్టమైన క్లారిటీ ఇచ్చాడు. సాధారణ కమర్షియల్ సినిమాలు లా శ్రీలీల పాత్ర కేవలం నాలుగు పాటలకు కొన్ని సీన్స్ కు మాత్రమే పరిమితం అవుతుందని క్లారిటీ ఇచ్చాడు.అంతేకాదు తన మూవీలో శ్రీలీల ఒక గ్లామర్ డాల్ గా కనిపిస్తుంది అన్న విషయం గురించి క్లారిటీ ఇచ్చాడు. తనకు 40 సంవత్సరాల వయసు అని చెపుతూ శ్రీలీల కు 22 సంవత్సరాల వయసు అయినప్పటికీ తమ ఇద్దరి మధ్య కాంబినేషన్ సీన్స్ ఈమూవీలో చాల రొమాంటిక్ గా ఉంటాయాని చెపుతూ తన సినిమాలో శ్రీలీల ను గ్లామర్ హీరోయిన్ గా మాత్రమే చూడాలని క్లారిటీ ఇచ్చాడు..మరింత సమాచారం తెలుసుకోండి: