తెలుగు సినీ పరిశ్రమలో అద్భుతమైన మాస్ ఇమేజ్ కరిగిన దర్శకులలో గోపీచంద్ మలినేని ఒకరు. ఈయన తన కెరియర్ లో ఇప్పటివరకు చాలా సినిమాలకు దర్శకత్వం వహించాడు. అందులో ఎన్నో మూవీలతో మంచి విజయాలను బాక్స్ ఆఫీస్ దగ్గర అందుకున్న ఈయన ప్రస్తుతం తెలుగు సినీ పరిశ్రమలో మంచి క్రేజ్ ఉన్న దర్శకుడిగా కెరియర్ ను కొనసాగిస్తున్నాడు. ఇకపోతే ఆఖరుగా ఈయన బాలకృష్ణ హీరోగా రూపొందిన వీర సింహా రెడ్డి మూవీ కి దర్శకత్వం వహించాడు.

మూవీ ని మైత్రి సంస్థ వారు నిర్మించారు. ఈ మూవీ ఈ సంవత్సరం సంక్రాంతి కానుకగా జనవరి 12 వ తేదీన విడుదల బాక్స్ ఆఫీస్ దగ్గర మంచి విషయాన్ని అందుకుంది. ఇకపోతే ఈ సినిమా తర్వాత ఈయన మరోసారి మైత్రి సంస్థలోనే సినిమా చేయనున్నట్లు ప్రకటించాడు. అలాగే ఈ మూవీ లో మాస్ మహారాజా రవితేజ హీరో గా నటించబోతున్నట్లు అధికారిక ప్రకటన కూడా వెలువడింది.

ఇక ఆ తర్వాత ఈ మూవీ కి భారీ బడ్జెట్ అవసరం కానున్న నేపథ్యంలో ఈ సినిమాను తాత్కాలికంగా నిలిపివేసినట్లు వార్తలు వచ్చాయి. దానితో మైత్రి సంస్థలోనే గోపీచంద్ తమిళ స్టార్ హీరోలలో ఒకరు అయినటువంటి అజిత్ కుమార్ తో మూవీ చేయనున్నట్లు ప్రస్తుతం అందుకు సంబంధించిన కథా చర్చలు జరుగుతున్నట్లు ఓ వార్త కొన్ని రోజుల క్రితం వైరల్ అయిన విషయం మనకు తెలిసిందే. ఇకపోతే ప్రస్తుతం అందుతున్న సమాచారం ప్రకారం గోపీచంద్ , అజిత్ తో మూవీ చేయబోతున్నట్లు వచ్చిన వార్తల్లో ఏ మాత్రం వాస్తవం లేదు అని తెలుస్తుంది. ప్రస్తుతం ఈ దర్శకుడు ఓ యంగ్ హీరోతో సినిమా చేసే ఆలోచనలో ఉన్నట్లు అందుకు సంబంధించిన కథను ప్రస్తుతం తయారు చేసుకుంటున్నట్లు ఓ వార్త వైరల్ అవుతుంది.


మరింత సమాచారం తెలుసుకోండి: