మీడియం రేంజ్ హీరోలలో టాప్ పొజిషన్ లో కొనసాగుతున్న నాని నితిన్ లు ఒక హిందీ డబ్బింగ్ సినిమా మ్యానియాకు తీవ్ర కలవర పాటులో ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. ఫీల్ గుడ్ మూవీగా ప్రమోట్ చేయబడుతున్న ‘హాయ్ నాన్న’ కమర్షియల్ మూవీగా ప్రమోట్ చేయబడుతున్న ‘ఎక్స్ ట్రాడినరి మేన్’ మూవీలకు ఊహించని పరిణామాలు ఎదురౌతున్నాయి.రణధీర్ కపూర్ సందీప్ వంగల కాంబినేషన్ లో విడుదలవుతున్న ‘యానిమల్’ టిక్కెట్ల కోసం బుక్ మై షో యాప్ లో ఏర్పడ్డ టిక్కెట్ల మ్యానియా టాపిక్ ఆఫ్ ది టాలీవుడ్ గా మారింది. ‘బాహుబలి’ ‘ఆర్ ఆర్ ఆర్’ మూవీల టిక్కెట్ల కోసం ఏర్పడిన మ్యానియాను ‘యానిమల్’ గుర్తుకు చేస్తోంది అంటూ కామెంట్స్ వస్తున్నాయి.వాస్తవానికి రణబీర్ కపూర్ మాస్ హీరో కాదు అతడి సినిమాలను గతంలో ఇంత విపరీతంగా తెలుగు ప్రేక్షకులు చూసిన సందర్భాలు కూడ లేవు. అయినప్పటికీ ‘యానిమల్’ మూవీని చూడటానికి సగటు తెలుగు ప్రేక్షకుడు ఎందుకు ఎగబడుతున్నాడో ఎవరికీ అర్థంకాని విషయంగా మారింది. ఈసినిమా ట్రైలర్ మరియు పాటలకు వచ్చిన స్పందనతో పాటు సందీప్ వంగా పై తెలుగు ప్రేక్షకులకు ఉన్న క్రేజ్ ను కూడ ‘యానిమల్’ మూవీ మ్యానియా సూచిస్తోంది.అంచనాలకు అనుగుణంగా ఈమూవీకి పాజిటివ్ టాక్ వస్తే వారం రోజులు తరువాత విడుదల అయ్యే నాని నితిన్ సినిమాలను యానిమల్ మ్యానియాలో ప్రేక్షకులు పట్టించుకోరా అన్నభయాలు ఈమూవీ బయ్యర్లను విపరీతంగా వెంటాడుతున్నట్లు టాక్. ఇప్పటికే ఈ రెండు సినిమాల ప్రమోషన్ మొదలు కావడంతో ఏదో ఒక కారణం చూపెట్టి నాని నితిన్ సినిమాలను వాయిదా వేసే పరిస్థితి లేదు అంటున్నారు. దీనితో ‘హాయ్ నాన్న’ ‘ఎక్స్ ఆర్డినరీ మేన్’ మూవీల బయ్యర్లు ‘యానిమల్’ ను చూసి తెగ కలవర పడుతున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఒక హిందీ డబ్బింగ్ సినిమా మ్యానియాకు టాలీవుడ్ హీరోలు షేక్ అవ్వడం టాపిక్ ఆఫ్ ది టాలీవుడ్ గా మారింది..  మరింత సమాచారం తెలుసుకోండి: