ఆ మధ్యకాలంలో ఏ ఇండస్ట్రీలో విన్న కూడా కియారా అద్వానీ పేరే వినిపించేది. ఏ పాన్ ఇండియా సినిమాలో నైనా కియారాను హీరోయిన్గా ఫస్ట్ ఛాయిస్ అన్న వార్తలు వినిపించేవి. కానీ ఇప్పుడు మాత్రం ఆ పరిస్థితి కనిపించడం లేదు. ప్రస్తుతం రెండు సినిమాల్లో మాత్రమే చేస్తోంది ఈ ముద్దుగుమ్మ . దాని తర్వాత చేయాల్సిన సినిమాలు పై ఇప్పటివరకు క్లారిటీ ఇవ్వడం లేదు. దీంతో సినీ లవర్స్ కొత్త ప్రశ్నలను రేకెత్తిస్తున్నారు. ఇటీవల ఫ్యామిలీ లైఫ్ స్టార్ చేసింది ఈ ముద్దుగుమ్మ. తన సినిమా పార్ట్నర్ సిద్ధార్థ మల్హోత్రాను పెళ్ళికూడా చేసుకుంది.

దాని తర్వాత కూడా వరుస సినిమాలు కంటిన్యూ చేస్తాను అని చెప్పింది. కనీసం హనీమూన్ కోసం బ్రేక్ కూడా తీసుకోకుండా వరుసగా షూటింగ్స్ చేసింది. పెళ్లి తర్వాత కూడా సినిమాలు కంటిన్యూ చేయడంతో పాటు గ్లామర్ విషయంలో కూడా అదే స్థాయిలో దూసుకుపోయింది. పెళ్లి తర్వాత సత్య ప్రేమ్ కి కద అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ ముద్దుగుమ్మ అందులో తన గ్లామర్ యాంగిల్ ను గట్టిగానే చూపించింది. కానీ ఊహించని విధంగా సినిమాల విషయంలో స్పీడ్ తగ్గించేసింది. ప్రజెంట్ శంకర్‌, రామ్ చరణ్ కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న గేమ్ చేంజర్ లో

 హీరోయిన్‌గా నటిస్తున్న ఈ బ్యూటీ, నిన్న మొన్నటి వరకు సౌత్ నార్త్ ఇండస్ట్రీల్లో మోస్ట్ వాంటెడ్ లిస్ట్‌లో ఉన్నారు. కానీ ఇప్పుడు మాత్రం అంతగా అమ్మడి పేరు వినిపించటం లేదు. కావాలనే సైడ్ అవుతున్నారో, పెళ్లి తరువాత ఇండస్ట్రీనే పక్కన పెట్టేస్తుందో తెలియదుగాని అప్‌ కమింగ్ ల విషయంలో కియారను పెద్దగా కన్సిడర్ చేయటం లేదు మేకర్స్‌. అంతేకాదు పెళ్లి తర్వాత తన కుటుంబం కోసం కియారా కావాలని సినిమాల నుండి బ్రేక్ తీసుకకోబోతోంది అని అంటున్నారు. సినిమాలకి కాస్త బ్రేక్ ఇచ్చి తన వివాహ జీవితాన్ని కూడా ఎంజాయ్ చేయాలి అని ప్లాన్ చేస్తుందట ఈ బ్యూటీ..!!

మరింత సమాచారం తెలుసుకోండి: