ఈటీవీలో ప్రసారమయ్యే జబర్దస్త్ కార్యక్రమం అంటే తెలుగు బుల్లితెరపై బిగ్గెస్ట్ కామెడీ షో గా పేరు సంపాదించుకుంది. ఇక అప్పటివరకు వెండితెరపై బుల్లితెరపై లేని సరికొత్త కామెడీని ప్రేక్షకులకు అందించి అతి తక్కువ సమయంలోనే ఇక తెలుగు ప్రజల హృదయాలని గెలుచుకుంది ఈ షో. అయితే ఈ కార్యక్రమాన్ని బీట్ చేసేందుకు ఎన్నో కొత్త కార్యక్రమాలు వచ్చిన ఒక్కటీ కూడా జబర్దస్త్ను దాటలేకపోయాయి. ఇక ఈ కామెడీ షో ప్రారంభమై దాదాపు 10 ఏళ్ళు దాటింది. ఈ పదేళ్లలో ఎంతోమందికి లైఫ్ ఇచ్చింది ఈ షో అనడంలో సందేహం లేదు.


 ఈ షోలో కమెడియన్ గా కామెడీ పంచి తర్వాత బయటికి వచ్చి స్టార్లుగా ఎదిగిన వారు చాలామంది ఉన్నారు. ఇక ఇప్పుడు జబర్దస్త్ లో చాలా మార్పులు జరిగాయ్. ఏకంగా జడ్జిగా ఉన్న రోజా, నాగబాబు తో పాటు ఇక యాంకర్లు కూడా పూర్తిగా మారిపోయారు. ఇక కమెడియన్స్ కూడా కొత్త కొత్త వారు జబర్దస్త్ లో కనిపిస్తున్నారు అని చెప్పాలి. అయితే సుడిగాలి సుదీర్, హైపర్ ఆదిలు జబర్దస్త్ మానేసిన తర్వాత ఈ షోకి ఉన్న క్రేజ్ అమాంతం తగ్గిపోయింది. అంతకుముందు కామెడీ లేకపోయినా సుదీర్, రష్మి ల కోసం షో చూసే ప్రేక్షకులే ఎక్కువగా ఉండేవారు  కానీ ఇప్పుడు ఈ ఇద్దరు కనిపించకపోవడంతో చివరికి షో రేటింగ్ పడిపోయింది. కాగా ప్రస్తుతం జబర్దస్త్ షో గురించి ఒక బ్యాడ్ న్యూస్ వినిపిస్తుంది. ఈ షో త్వరలోనే క్లోజ్ కాబోతుందట. మల్లెమాల వారు జబర్దస్త్ ని క్లోజ్ చేయాలని భావిస్తున్నారట. షో ప్రారంభించి 10 ఏళ్ళు దాటిన నేపథ్యంలో.. దీనిని క్లోజ్ చేయాలని అనుకుంటున్నారట. అయితే దీనికి సంబంధించిన కారణం కూడా ఆసక్తికరంగా మారిపోయింది. ఇటీవల కాలంలో షోకి క్రేజ్ తగ్గింది. రేటింగ్ తగ్గింది. ఆర్టిస్టులు కామెడీ వర్కౌట్ కావట్లేదు. ప్రేక్షకులకు జబర్దస్త్ కార్యక్రమం పై నెగిటివిటీ వచ్చేముందు షో క్లోజ్ చేస్తే బాగుంటుందని మల్లెమాల నిర్వాహకులు అనుకుంటున్నారట.

మరింత సమాచారం తెలుసుకోండి: