తెలుగు, హిందీ, తమిళ్, కన్నడ అనే తేడా లేకుండా ప్రస్తుతం అన్ని ఇండస్ట్రీలలో మారుమోగిపోతున్న డైరెక్టర్ పేరు ఏంటి అంటే సందీప్ రెడ్డి వంగ  గతంలో అర్జున్ రెడ్డి అనే సినిమాతో ఎలాంటి అంచనాలు లేకుండా ప్రేక్షకుల ముందుకు వచ్చి ఎలా అయితే సెన్సేషన్ సృష్టించాడో.. ఇక ఇప్పుడు కూడా సందీప్ రెడ్డి వంగ తన దర్శకత్వంలో వచ్చిన యానిమల్ సినిమాతో ఇంతే సెన్సేషన్ సృష్టించాడు అని చెప్పాలి. అర్జున్ రెడ్డి తర్వాత కాస్త గ్యాప్ తీసుకుని అదే సినిమాను హిందీలో రీమేక్ చేసిన ఈ డైరెక్టర్.. ఇక ఈ సినిమాతో కూడా బ్లాక్ బస్టర్ కొట్టాడు. అయితే ఆ తర్వాత మరింత గ్యాప్ తీసుకొని యానిమల్ అనే మూవీతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు సందీప్.


 ఈ మూవీలో రణబీర్ కపూర్ హీరోగా నటించగా.. నేషనల్ క్రైస్ట్ రష్మిక మందన హీరోయిన్ పాత్రలో ప్రేక్షకులను పలకరించింది. అయితే లవ్ అండ్ యాక్షన్ ఎంటర్టైనర్గా తెరకెక్కిన ఈ సినిమాకు ప్రేక్షకులు అందరూ కూడా బ్రహ్మరథం పడుతున్నారు. ఈ క్రమంలోనే బాక్స్ ఆఫీస్ వద్ద ఈ మూవీ వసూళ్ల సునామీ సృష్టిస్తుంది అని చెప్పాలి. ఇక మరోసారి సందీప్ రెడ్డి వంగ తన టేకింగ్ తో సినీ ప్రేక్షకులందరికీ కూడా ఫిదా చేశాడు అనడంలో ఎలాంటి సందేహం లేదు. అతిగా రొమాన్స్ తో పాటు యాక్షన్ ఉందని కాస్త అక్కడక్కడ విమర్శలు వస్తున్న.. ఇక ఈ మూవీ మాత్రం వసూళ్లతో సెన్సేషన్ సృష్టిస్తుంది.


 అయితే ఇలా యానిమల్ మూవీ తో భారీ సక్సెస్ సొంతం చేసుకున్న డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగ.. ఇటీవల అమెరికాలో పర్యటించారు. ఈ క్రమంలోనే అక్కడ ప్రేక్షకులతో ముచ్చటించారు ఈ డైరెక్టర్. ఈ సందర్భంగా మెగాస్టార్ చిరంజీవితో ఒక సినిమా చేయాలని ఉంది అంటూ మనసులో మాట బయట పెట్టేసాడు ఈ డైరెక్టర్. అవకాశం లభిస్తే చిరంజీవితో యాక్షన్ డ్రామా సినిమా చేస్తాను అంటూ చెప్పుకొచ్చాడు. ఇక ఈ మాట విని మెగా ఫాన్స్ అందరు కూడా ఆనందంలో మునిగిపోయారు. మెగాస్టార్ తో త్వరగా సినిమా చేయాలని సందీప్ రెడ్డి వంగను ఫ్యాన్స్ అందరూ కూడా సోషల్ మీడియా వేదికగా కోరుతూ ఉండడం గమనార్హం.

మరింత సమాచారం తెలుసుకోండి: