షారుఖ్ ఖాన్ ఈ సంవత్సరం ఏకంగా రెండు భారీ హిట్లు అందుకొని తన రేంజ్ ఏంటో మరోసారి చూపించారు.ఈ ఏడాది షారుఖ్ ఖాన్ పఠాన్ సినిమాతో భారీ విజయాన్ని అందుకున్నారు.యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కిన పఠాన్ సినిమా ఏకంగా వెయ్యికోట్ల రూపాయలను వసూల్ చేసి రికార్డ్ క్రియేట్ చేసింది.సిద్ధార్థ్ ఆనంద్ డైరెక్షన్ లో తెరకెక్కిన ఈ సినిమా లో దీపికా పదుకొనే హీరోయిన్ గా నటించింది. అలాగే  జాన్ అబ్రహం ఈ సినిమాలో విలన్ గా నటించారు.2023 జనవరి 25న హిందీతో పాటు తమిళం, తెలుగులో కూడా విడుదలై పఠాన్ మూవీ భారీ విజయాన్ని అందుకుంది.  పఠాన్ మూవీ భారీ విజయాన్ని అందుకున్నా షారుఖ్ ఆ తర్వాత  జవాన్ తో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు.తమిళ దర్శకుడు అట్లీ డైరెక్షన్ లో జవాన్ మూవీ తెరకెక్కింది. జవాన్ మూవీ కూడా భారీ విజయాన్ని అందుకుంది. జవాన్ ఏకంగా 1100కోట్లకు పైగా వసూల్ చేసి రికార్డ్ క్రియేట్ చేసింది.ఈ రెండు సినిమాల రిలీజ్ కు ముందు  షారుఖ్ జమ్మూలోని వైష్ణో దేవి అమ్మవారిని దర్శించుకున్నారు.


ఇక ఇప్పుడు మూడో సారి షారుఖ్ ఖాన్ అమ్మవారి ఆలయాన్ని దర్శించుకున్నారు. ఆయన నటించిన డంకి సినిమా త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది. రాజ్ కుమార్ హిరానీ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ మూవీ డిసెంబర్ 21న ప్రేక్షకుల ముందుకు రానుంది. దీనితో సెంటిమెంట్ గా ఈ సినిమా రిలీజ్ కు ముందు షారుక్ ఖాన్ ఇలా అమ్మవారిని దర్శించుకున్నారు. ఇక ఇందుకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతున్నాయి.ఈ సినిమాకి అడ్వాన్స్ బుకింగ్స్ బాగా జరుగుతున్నాయి.అయితే షారుఖ్ ఖాన్ డంకీ సినిమాకు పోటీగా పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ సలార్ సినిమా డిసెంబర్ 22 న విడుదల అవుతుంది. ఈ సినిమాకి ఇంకా రికార్డు లెవెల్లో బుకింగ్స్ జరుగుతున్నాయి. ఈ మూవీ ప్రమోషన్స్ లో భాగంగా సలార్ మూవీ టీంతో రాజమౌళి ఇంటర్వ్యూ జరగనుంది. ఈ ఇంటర్వ్యూలో రాజమౌళి డైరెక్టర్ ప్రశాంత్ నీల్ ని ఇంట్రెస్టింగ్ క్వశ్చన్స్ అడగనున్నారు.ఇక ఈ రెండు బిగ్గెస్ట్ మూవీస్ మధ్య బాక్స్ ఆఫీస్ వార్ బాగా జరగనుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: