మోస్ట్ బ్యూటిఫుల్ నటిమని అనుపమ పరమేశ్వరన్ గురించి ప్రత్యేకంగా తెలుగు సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఈ నటి నితిన్ హీరోగా త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో రూపొందిన "అ ఆ" అనే సినిమాతో తెలుగు తెరకు పరిచయం అయింది. ఈ మూవీ మంచి విజయం సాధించడం ఇందులో ఈ బ్యూటీ తన నటనతో , అందచందాలతో ప్రేక్షకులను ఆకట్టుకోవడంతో ఈ సినిమా తర్వాత వరుసగా ఈ బ్యూటీ కి టాలీవుడ్ ఇండస్ట్రీ లో క్రేజీ సినిమా అవకాశాలు దక్కాయి. అందులో భాగంగా ఇప్పటికే అనేక సినిమాలలో నటించి ఎన్నో విజయాలను తెలుగు బాక్స్ ఆఫీస్ దగ్గర అందుకున్న ఈ బ్యూటీ ఇప్పటికీ కూడా టాలీవుడ్ ఇండస్ట్రీ లో అద్భుతమైన క్రేజ్ ఉన్న నటిగా కెరియర్ ను కొనసాగిస్తుంది. ఇకపోతే తాజాగా ఈ బ్యూటీ మాస్ మహారాజా రవితేజ హీరోగా కార్తీక్ ఘట్టమనేని దర్శకత్వంలో రూపొందిన ఈగల్ అనే సినిమాలో హీరోయిన్ గా నటించింది. ఈ మూవీ ని వచ్చే సంవత్సరం సంక్రాంతి కానుకగా జనవరి 13 వ తేదీన విడుదల చేయనున్నారు.

మూవీ పై ప్రేక్షకులు మంచి అంచనాలు పెట్టుకున్నారు. మరి ఈ మూవీ తో ఈ నటికి ఏ స్థాయి విజయం బాక్స్ ఆఫీస్ దగ్గర అందుతుందో చూడాలి. ఇకపోతే ఈ బ్యూటీ సినిమాల్లో అప్పుడప్పుడు తన హాట్ అందాలను ఆరబోస్తూ వస్తున్న విషయం మనకు తెలిసిందే. అదే విధంగా సోషల్ మీడియాలో కూడా తనకు సంబంధించిన హాట్ అందాలను ఆరబోస్తూ ఉంది. అలాగే కొన్ని సందర్భాలలో ఈ బ్యూటీ తనకు సంబంధించిన క్లాస్ లుక్ లో ఉన్న ఫోటోలను కూడా తన సోషల్ మీడియా అకౌంట్ లో పోస్ట్ చేస్తుంది. తాజాగా అనుపమ అదిరిపోయే లుక్ లో ఉన్న పర్పుల్ కలర్ శారీని కట్టుకొని అందుకు తగిన పర్పుల్ కలర్ లో ఉన్న బ్లౌజ్ ను ధరించి అదిరిపోయే యాంగిల్ లో ఉన్న ఒక ఫోటోను తన సోషల్ మీడియా అకౌంట్ లో పోస్ట్ చేసింది. ప్రస్తుతం ఆ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: