తెలుగు సినీ పరిశ్రమలో ప్రస్తుతం టాప్ హీరోయిన్ లలో ఒకరిగా కెరియర్ ను కొనసాగిస్తున్న నేషనల్ క్రష్ రష్మిక మందన గురించి ప్రత్యేకంగా టాలీవుడ్ సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఈ ముద్దు గుమ్మ "ఛలో" అనే సినిమాతో తెలుగు తెరకు పరిచయం అయ్యి మొదటి మూవీ తోనే సూపర్ సక్సెస్ ను అద్భుతమైన గుర్తింపును సంపాదించుకుంది. ఇక ఆ తర్వాత నుండి రష్మిక కు వరుసగా తెలుగులో అవకాశాలు దక్కడం అందులో భాగంగా ఈ నటి నటించిన సినిమాలలో చాలా శాతం సినిమాలు బాక్స్ ఆఫీస్ దగ్గర సూపర్ సక్సెస్ లు అవుతూ ఉండడంతో ఈ నటి చాలా తక్కువ కాలంలోనే టాలీవుడ్ లో టాప్ హీరోయిన్ స్నానానికి చేరిపోయింది.

ఇకపోతే ఇప్పటివరకు ఎన్నో బ్లాక్ బస్టర్ సినిమాలలో నటించిన ఈ ముద్దుగుమ్మ తన కెరియర్ లో ఒక్క లేడీ ఓరియంటెడ్ సినిమాలో కూడా ప్రధాన పాత్రలో నటించలేదు. దానితో ఈ బ్యూటీ ప్రస్తుతం టాలీవుడ్ నటుడు మరియు దర్శకుడు అయినటువంటి రాహుల్ రవీంద్రనాథ్ దర్శకత్వంలో రూపొందుతున్న "గర్ల్ ఫ్రెండ్" అనే లేడీ ఓరియంటెడ్ సినిమాలో ప్రధాన పాత్రలో నటిస్తోంది. ఈ మూవీ షూటింగ్ కొన్ని రోజుల క్రితమే ప్రారంభం అయింది. ఈ సినిమాను గీత ఆర్ట్స్ బ్యానర్ పై అల్లు అరవింద్ నిర్మిస్తున్నాడు.

ఇకపోతే తాజాగా ఈ మూవీ షూటింగ్ కు సంబంధించిన ఒక కేజీ న్యూస్ బయటకు వచ్చింది. అసలు విషయం లోకి వెళితే ... ప్రస్తుతం ఈ మూవీ బృందం వారు షామీర్ పేట లో రష్మిక మందన పై ఈ సినిమాకు సంబంధించిన కొన్ని కీలక సన్నివేశాలను చిత్రీకరిస్తున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఈ మూవీ బృందం వారు చిత్రీకరిస్తున్న సన్నివేశాలు ఈ మూవీ కే హైలైట్ గా నిలవనున్నట్లు తెలుస్తోంది. అలాగే ప్రస్తుతం ఈ మూవీ బృందం వారు చిత్రీకరిస్తున్న సన్నివేశాలు కూడా అద్భుతంగా వస్తున్నట్లు తెలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: