యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ గురించి ప్రత్యేకంగా తెలుగు సినీ ప్రేమికులకు పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఇప్పటికే ఎన్నో బ్లాక్ బాస్టర్ సినిమాలలో నటించిన ఎన్టీఆర్ ఇండియా వ్యాప్తంగా అద్భుతమైన గుర్తింపును సంపాదించుకున్నాడు. ప్రస్తుతం ఎన్టీఆర్ "దేవర" అనే సినిమాలో హీరోగా నటిస్తున్నాడు. ఈ మూవీ మొత్తం రెండు భాగాలుగా విడుదల కానుండగా అందులో మొదటి భాగాన్ని వచ్చే సంవత్సరం ఏప్రిల్ 5 వ తేదీన విడుదల చేయనున్నారు. ఇది ఇలా ఉంటే ఈ మూవీ కి తెలుగు సినీ పరిశ్రమలో దర్శకుడిగా తనకంటూ ఒక సూపర్ క్రేజ్ ను ఏర్పరచుకున్న కొరటాల శివ దర్శకత్వం వహిస్తూ ఉండగా ... బాలీవుడ్ బ్యూటీ జాన్వి కపూర్ ఈ సినిమాలో ఎన్టీఆర్ కు జోడిగా నటిస్తోంది. ఈ మూవీ లో సైఫ్ అలీ ఖాన్ ప్రతి నాయకుడి పాత్రలో కనిపించనుండగా ... అనిరుద్ రవిచంద్రన్ ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నాడు.

ఇది ఇలా ఉంటే ఈ మూవీ విడుదల తేదీ దగ్గర పడుతున్న నేపథ్యంలో ఈ సినిమా నుండి గ్లిమ్స్ వీడియోను విడుదల చేయడానికి ఈ చిత్ర బృందం రెడీ అయినట్లు తెలుస్తోంది. అందులో భాగంగా ఇప్పటికే ఈ గ్లిమ్స్ వీడియోకు సంబంధించిన పనులను అన్నింటినీ ఈ చిత్ర బృందం పూర్తి చేసినట్లు తెలుస్తోంది. ఇకపోతే ఈ గ్లిమ్స్ వీడియో ఎక్కువ శాతం విఎఫ్ఎక్స్ షాట్స్ ఉండడంతో వాటిని కూడా తాజాగా ఈ మూవీ బృందం పూర్తి చేసినట్లు సమాచారం. ఇకపోతే ప్రస్తుతం అందుతున్న సమాచారం ప్రకారం ఈ మూవీ యొక్క ఫస్ట్ గ్లిమ్స్ వీడియోను వచ్చే సంవత్సరం జనవరి 8 వ తేదీన విడుదల చేసే ఆలోచనలో ఈ చిత్ర బృందం ఉన్నట్లు అందుకు సంబంధించిన అధికారిక ప్రకటనను మరో ఒకటి రెండు రోజుల్లో విడుదల చేయబోతున్నట్లు తెలుస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: