ఇక ఈ సినిమాలోని ప్రతీ క్యారెక్టర్ కూడా అటు ప్రేక్షకులందరికీ కూడా బాగా కనెక్ట్ అయిపోయాయి. అయితే ఈ మూవీలో రణబీర్ కబీర్ భార్య పాత్ర అయినా గీతాంజలి రోల్లో నేషనల్ క్రష్ రష్మిక మందన్న నటించింది. అయితే ఈ మూవీలో మరో కీలక పాత్రలో కనిపించింది బాలీవుడ్ బ్యూటీ తృప్తి దిమ్రి. అయితే కనిపించింది కాసేపే అయినా తన నటనతో అందరిని ఆకట్టుకుంది. తన అందం అభినయంతో కుర్ర కారుమతి పోగొట్టేసింది. ఏకంగా ఇంటిమేట్ సీన్లలో కూడా నటించి అందరిని ఆశ్చర్యపరిచింది. దీంతో మెయిన్ హీరోయిన్ రష్మిక కంటే ఎక్కువగా తృప్తి దిమ్రికి పేరు వచ్చింది. అయితే ఇక ఇప్పుడు వరుసగా అవకాశాలు కూడా అందుకుంటుందట ఈ ముద్దుగుమ్మ.
ఇప్పటికే అటు సౌత్ నుంచి పలు ఆఫర్లను దక్కించుకుంది ఈ సొగసరి. అటు బి టౌన్ లో కూడా ఏకంగా కార్తీక్ ఆర్యన్ హీరోగా నటిస్తున్న ఆశికి 3లో కథానాయకగా నటించే ఛాన్స్ కొట్టేసిందట. ఆషికి 2 సినిమా బాలీవుడ్ లో ఏ రేంజ్ లో సెన్సేషన్ క్రియేట్ చేసి సూపర్ హిట్ అయిందో ప్రత్యేకంగా చెప్పాల్సిర పనీ లేదు. ఇక ఇప్పుడు భారీ అంచనాల మధ్య ఆషీకీ త్రీ సినిమా తెరకేక్కాల్సి ఉండగా కార్తీక్ ఆర్యన్ సరసన తృప్తి జంటగా కనిపించనున్నట్లు తెలుస్తోంది. ఇక సందీప్ రెడ్డి వంగ, హీరో ప్రభాస్ కాంబోలో రాబోతున్న సినిమాలోను ఛాన్స్ కొట్టేసిందట ఈ ముద్దుగుమ్మ.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి