పవన్ నటిస్తున్న సినిమాలన్నీ కూడా మధ్యలోనే ఆగిపోయాయి.డైరెక్టర్ హరీష్ శంకర్ తో ఉస్తాద్ భగత్ సింగ్ , డైరెక్టర్ సుజిత్ తో OG, క్రిష్ దర్శకత్వంలో హరిహర వీరమల్లు చిత్రాలు మధ్యలో ఆగిపోయాయి.ఈ మూడు సినిమాలు ఆగిపోవడంతో ఏ సినిమాలు ఎప్పుడు వస్తాయనే విషయం పైన ఇంకా క్లారిటీ రాలేదు.. డేట్లు అడ్జస్ట్ చేయలేకపోవడంతో ఇందులో కొంతమంది డైరెక్టర్లు ఇతర హీరోలతో చేయడానికి సిద్ధమవుతున్నారు. సుజిత్ మాత్రం OG సినిమా కోసమే వెయిట్ చేస్తున్నారు. ఈ సినిమా కోసం మరో 15 నుంచి 20 రోజులపాటు పవన్ కళ్యాణ్ డేట్ ఇస్తే చాలు ఈ సినిమా షూటింగ్ పూర్తి అవుతుందని సమాచారం.
అయితే ఇప్పట్లో పవన్ కళ్యాణ్ ఈ డేట్ లను సైతం ఇచ్చేలా కనిపించలేదు.తాజాగా చిత్ర బృందం OG సినిమా నుంచి అప్డేట్ ఇవ్వడం జరిగింది..DVV ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పైన ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు.. తమ ట్విట్టర్ నుంచి ఇలా తెలియజేస్తూ.. ఏం జరిగినా తగ్గేదేలే అని తెలియజేశారు కొత్త ఏడాది విషెస్ తెలియజేస్తూ యాంగ్రీ జీతాలాగా కొత్త ఏడాదిలోకి జంప్ అవుతున్నామంటూ గివెన్ ఇచ్చేది లే అంటూ తెలియజేశారు. ఈ ఏడాది పవన్ కళ్యాణ్ ఓజి సినిమాతో పాటు నానితో సరిపొద శనివారం అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నట్లు తెలియజేశారు.. ఈ ఏడాది ఎన్నో పండుగలు సోమవారమే వస్తున్నాయి.. ఇంకేం సరిపోదా ఈ లాంగ్ వీకెండ్ ఎంజాయ్ చేయండి అంటూ తెలిపారు.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి