టాలీవుడ్ టాప్ హీరోగా దూసుకుపోతున్న సూపర్ స్టార్ మహేష్ బాబు రీసెంట్ గా గుంటూరు కారంతో హిట్టు కొట్టిన తరువాత జెర్మనీకి సోలో ట్రిప్ వెళ్లిన సంగతి తెలిసిందే. ఫారిన్ కి ఎప్పుడు ఫ్యామిలీతో వెళ్లే సూపర్ స్టార్ మహేష్.. ఈసారి మాత్రం ఒంటరిగా వెళ్లడంతో అభిమానులంతా కూడా SSMB29కి సంబందించిన వర్క్ కోసం వెళ్తున్నారని అనుకున్నారు.అయితే మహేష్ బాబు జెర్మనీ వెళ్ళింది మాత్రం ఒక డాక్టర్‌ని కలుసుకోవడం కోసమట. మహేష్ బాబు ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేసిన తాజా ఫొటోతో ఆ విషయం తెలిసింది.సూపర్ స్టార్ మహేష్ బాబు ఆ డాక్టర్ ని కలుసుకోవడం ఇది  కేవలం మొదటిసారి మాత్రమే కాదు. గతంలో 2023 ఏప్రిల్, 2022 జూన్‌లో కూడా మహేష్ బాబు ఆ డాక్టర్ ని కలుసుకున్నట్లు తెలుస్తుంది. ఆ సమయంలో మహేష్ తో దిగిన ఫోటోలను కూడా ఆ డాక్టర్ తన ఇన్‌స్టాగ్రామ్ లో షేర్ చేశారు.  అసలు ఇంతకీ ఆ డాక్టర్ ఎవరు..? మహేష్ బాబు అతని దగ్గర ఏ ట్రీట్మెంట్ తీసుకుంటున్నారు..? అనే ప్రశ్నలకు కూడా ఆ డాక్టర్ ఇన్‌స్టాగ్రామ్ లోనే మనకు సమాధానం దొరుకుతుంది.


డాక్టర్ పేరు 'హరీ కొనిగ్'.  ఈయన బాడీ ఫిట్‌నెస్ కి సంబంధించిన డాక్టర్ అని తెలుస్తుంది. ఈమధ్య కాలంలో మహేష్ బాబు తన ఫిట్‌నెస్ పై ఎక్కువగా దృష్టి పెట్టిన సంగతి తెలిసిందే. మహేష్ బాబుకి గ్యాప్ దొరుకుంతుంటే చాలు జిమ్ లో వర్క్ అవుట్స్ చేస్తూ కనిపిస్తున్నారు. అందుకు సంబంధించిన ఫోటోలు, వీడియోలను కూడా మహేష్ బాబు రెగ్యులర్ గా సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ అభిమానులను సంతోష పరుస్తాడు.ఇక సూపర్ స్టార్ మహేష్ రాజమౌళి దర్శకత్వంలో  చేస్తున్న మూవీ అడ్వెంచర్ యాక్షన్ థ్రిల్లర్ గా తెరకెక్కబోతుంది. అమెజాన్ అడవుల నేపథ్యంలో వస్తున్న ఈ సినిమాలో మహేష్ థ్రిల్లింగ్ యాక్షన్ స్టంట్స్ చేయబోతున్నారట.ఇక ఈ మూవీకి సంబంధించిన స్క్రిప్ట్ వర్క్ అంతా కూడా కంప్లీట్ అయ్యిందని రైటర్ విజయేంద్రప్రసాద్ ఇటీవల అభిమానులకు తెలియజేశారు. మరి ఈ సినిమా ఎప్పుడు షూటింగ్ జరుపుకుంటుందో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: