నరసింహ సినిమాలో రమ్యకృష్ణ పాత్ర ఎంత పవర్ఫుల్ గా తెరకెక్కిందో మనందరికీ తెలిసిందే. రజనీకాంత్ కన్నా కూడా ప్రేక్షకులలో ప్రభావితం ప్రాధాన్యత సంతరించుకున్న ఈ పాత్ర ఆమె కెరియర్లో ఒక మైలురాయిగా మిగిలిపోయింది.అప్పటినుంచి మొదలైన రమ్యకృష్ణ హవ అంతకు ముందు వరకు కేవలం పరిమితమైనప్పటికీ నరసింహ చిత్రం తర్వాత ఆమెలోని మరో కోణాన్ని అందరూ తెలుసుకున్నారు. మొన్నటికి మొన్న బాహుబలి లో కూడా ఆమె అదే పవర్ఫుల్ పోషించారంటే అందుకు నరసింహ సినిమా ద్వారా పడిన బీజమే అని అనుకోవచ్చు. ఏ సినిమాలో అయినా నటీనటుల కన్నా కూడా పవర్ఫుల్ పాత్ర పోషించాలి అంటే రమ్యకృష్ణ మాత్రమే ఏకైక ఆప్షన్ అని అందరూ అనుకునేలా చేసింది.అయితే ఈ సినిమాలో రమ్యకృష్ణ పాత్ర కోసం మొదట అనుకున్న నటి ఈమె కాదట. సినిమా దర్శకుడు రమ్యకృష్ణ పాత్ర కోసం నటి మీనా ను సంప్రదించాడట.

అప్పటికే రజనీకాంత్ పలు సినిమాల్లో హిట్ పెయిర్ గా మీనా కు మంచి పేరుంది. మీనా అయితేనే బాగుంటుంది అని దర్శకుడు అనుకున్నప్పటికీ పాత మొత్తం విన్న తర్వాత మీనా ఈ పాత్రకి సెట్ కాదు అని అభిప్రాయానికి మీనా తల్లి వచ్చారట. కానీ రమ్యకృష్ణ పాత్రలో తను నటించాలని అనుకున్నప్పటికీ తల్లి చెప్పిన మాట విని మీనా కూడా నో చెప్పిందట.  ఎందుకంటే మీనా ఫ్యామిలీ ఆడియన్స్ కి బాగా కనెక్ట్ అయ్యారు అందువల్లే అంతటి పవర్ఫుల్ పాత్రలో ఇమడ లేదు అని ఆమె భావించారట. అదే విషయాన్ని దర్శకుడు కూడా సినిమా రిలీజ్ అయిన తర్వాత చెప్పారట.ఆరోజు మీనా తల్లి సలహా ఇచ్చి ఉండకపోతే రమ్యకృష్ణ నీ తీసుకునేవారు కాదని మీనా కోసం క్లైమాక్స్ మార్చేసే వాళ్ళమంటూ దర్శకుడు తెలిపారట. ఏది ఏమైనా నిజంగానే ఈ మాట విన్న తర్వాత మీనా ఆ పాత్రకు సెట్ కాదు అని అందరికీ అర్థమైపోయింది. రమ్యకృష్ణ ఆ సినిమాతో స్టార్ హీరోల వద్ద లేడీ స్టార్ హీరోయిన్ గా మారిపోయింది.

మరింత సమాచారం తెలుసుకోండి: