మొదటి తోనే తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకుంది. తన నటనతో విమర్శకుల ప్రశంసలు అందుకుని ఎవరూ ఊహించని స్థాయిలో క్రేజ్ సంపాదించుకుంది. దీంతో ఆమెకు బాలీవుడ్ ఇండస్ట్రీలో వరుస ఆఫర్స్ క్యూ కట్టాయి.అతి తక్కువ సమయంలోనే స్టార్ డమ్ అందుకుని సినీ పరిశ్రమలో ఓ వెలుగు వెలిగింది.. కానీ అంతలోనే ఆత్మహత్య చేసుకుని ఈ లోకాన్ని విడిచివెళ్లిపోయింది. ఆమె తీసుకున్న నిర్ణయం యావత్ సినీ ఇండస్ట్రీని షాక్‏కు గురిచేసింది. కేవలం 25 ఏళ్ల వయసులోనే ప్రేమ తాలూకు మోసానికి బలైంది. కథానాయికగా భారీ విజయాన్ని అందుకుని.. ఎంతో మంది అభిమానులను సొంతం చేసుకుని కెరీర్ మంచి ఫాంలో ఉన్న సమయంలోనే తన నివాసంలో ఊరివేసుకుని మరణించింది. తనే జియా ఖాన్. ఇప్పటికీ తమ కూతురి మరణంపై న్యాయం చేయాలంటూ ఆమె కుటుంబసభ్యులు డిమాండ్ చేస్తున్నారు. 2013లో ఇండస్ట్రీలో సంచలనం సృష్టించింది జియా ఖాన్ సూసైడ్. ఇంతకీ అసలు ఈ జియా ఖాన్ ఎవరు ?..హీరోయిన్‏గా వరుస ఆఫర్స్ అందుకుంటున్న సమయంలోనే ఎందుకు సూసైడ్ చేసుకుంది ? అనే విషయాలు తెలుసుకుందామా..
జియా ఖాన్ ఫిబ్రవరి 20, 1988న న్యూయార్క్‌లో జన్మించింది. ఆమె తండ్రి, అలీ రిజ్వీ ఖాన్, భారతీయ సంతతికి చెందిన అమెరికన్ పౌరుడు, ఆమె తల్లి రబియా అమీన్ హిందీ పరిశ్రమలో నటి. లండన్, న్యూయార్క్ సిటీలలో గ్రాడ్యుయేషన్ పూర్తిచేసిన జియా.. నటనపై ఆసక్తితో ముంబైకి వచ్చింది. బాలీవుడ్ ఇండస్ట్రీలో జియా ఖాన్ చేసింది తక్కువ లే. కానీ ఆమె నటనకు ప్రేక్షకులు ఫిదా అయ్యారు. ఈ లో జియా నటనకు ఫిలింఫేర్ బెస్ట్ ఫిమేల్ డెబ్యూ అవార్డు అందుకుంది. ఈ చిత్రానికి రామ్ గోపాల్ వర్మ దర్శకత్వం వహించారు. ఈ తర్వాత ఆమెకు అమీర్ ఖాన్ నటించిన గజిని మూవీలో అవకాశం వచ్చింది. ఆ తర్వాత ఆఫర్స్ క్యూ కట్టాయి. ఆమె చివరిసారిగా నటించిన హౌస్ ఫుల్. ఈ మూవీ 2010లో విడుదలైంది. ఇందులో ఆమె అక్షయ్ కుమార్, దీపికా పదుకొనే, రితేష్ దేశ్‌ముఖ్‌లతో పాటు ప్రధాన పాత్రలో కనిపించింది. కెరీర్ పరంగా అదృష్టం వెన్నంటే ఉన్నా.. వ్యక్తిగత జీవితం మాత్రం విషాదకరమే.జియా రెండేళ్ల వయసులోనే ఆమె తల్లిదండ్రులు విడిపోయారు. ఆ తర్వాత జియా తన తల్లి వద్దే పెరిగింది. అప్పటికే ఇండస్ట్రీలో ఆమె తల్లి వరుస లు చేస్తూ బిజీగా ఉండేది. దీంతో జియాకనటనపై ఆసక్తి ఏర్పడింది. హిందీలో జియా చేసింది మూడు లే. కానీ ఊహించని స్టార్ డమ్ అందుకుంది. అయితే అప్పటికే ఆమెకు ఎన్నో అవకాశాలు వచ్చాయి. కానీ 2013 జూన్ 3న తన బెడ్ రూంలో ఆత్మహత్య చేసుకుంది. తన కూతురు చనిపోవడానికి కారణం ఆమె ప్రియుడు నటుడు ఆదిత్య పంచోలీ అని.. అతడి వేధింపుల కారణంగానే జియా సూసైడ్ చేసుకున్నట్లు ఆరోపణలు వచ్చాయి. ఈరోజు జియాఖాన్ జయంతి. ఈ సందర్భంగా ఆమె జ్ఞాపకాలను సోషల్ మీడియా వేదికగా పంచుకుంటున్నారు అభిమానులు.

మరింత సమాచారం తెలుసుకోండి: