నందమూరి నట సింహం బాలకృష్ణ టాలీవుడ్ మాస్ దర్శకుడు బోయపాటి శ్రీను కాంబోలో అఖండ అనే సినిమా కొంత కాలం క్రితం రూపొందిన విషయం మన అందరికీ తెలిసిందే. ఈ మూవీ లో మోస్ట్ బ్యూటిఫుల్ నటిమని ప్రగ్యా జైస్వాల్ , బాలకృష్ణ సరసన హీరోయిన్ గా నటించగా ... పూర్ణమూవీ లో ఓ కీలకమైన పాత్రలో నటించింది. శ్రీకాంత్మూవీ లో విలన్ పాత్రలో నటించగా ... ఎస్ ఎస్ తమన్ ఈ సినిమాకు సంగీతం అందించాడు. ఇకపోతే ఈ సినిమాలో బాలయ్య డ్యూయల్ రోల్ లో నటించాడు. అందులో ఒక పాత్రలో అగోరా గా బాలయ్య బాబు కనిపించగా ... మరో పాత్రలో రైతుగా కనిపించాడు.

ఈ రెండు పాత్రల్లో కూడా బాలకృష్ణ అద్భుతమైన వేరియేషన్స్ చూపించి తన నటనతో ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్నాడు. ఇకపోతే భారీ అంచనాల నడుమ విడుదల అయిన ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర అద్భుతమైన కలెక్షన్ లను వసూలు చేసి బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకుంది. ఇకపోతే ఈ సినిమా బ్లాక్ బస్టర్ విజయం సాధించడంతో ఈ మూవీ బృందం వారు ఈ సినిమాకు సీక్వెల్ ఉండబోతుంది అని ప్రకటించారు. ఇకపోతే ప్రస్తుతం అందుతున్న సమాచారం ప్రకారం ఇప్పటికే బోయపాటి శ్రీను "అఖండ 2" కి సంబంధించిన కథను రెడీ చేసినట్లు ... దానితో ఏం రత్నం ఆ కథకు సరిపోయే డైలాగ్స్ ను ఇప్పటికే కంప్లీట్ చేసినట్లు వార్తలు వస్తున్నాయి.

ఇక ప్రస్తుతం బాలకృష్ణ , బాబీ దర్శకత్వంలో రూపొందుతున్న సినిమాలో హీరో గా నటిస్తున్నాడు. ఈ సినిమా షూటింగ్ పూర్తి చేసి బాలకృష్ణ ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో చురుగ్గా పాల్గొనబోతున్నట్లు తెలుస్తుంది. అలా కొంత కాలం పాటు రాజకీయ పనుల్లో బిజీగా ఉండనున్న బాలకృష్ణ ఆ తర్వాత "అఖండ 2" సినిమా షూటింగ్ లో పాల్గొనబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: