బీటెక్ చదివే రోజుల్లోనే నేను ఒక అబ్బాయిని ప్రేమించా.. మా ఎంటెక్ వరకు ఇద్దరం రిలేషన్‌లో ఉన్నాం. పెద్దలతో కూడా మా ప్రేమ విషయం చెప్పాము. వాళ్లు అంగీకరించారు. పెళ్ళికి కూడా రెడీ అయ్యాం.. ముహూర్తం కూడా పెట్టుకున్నాం. కానీ ఊహించని సంఘటన జరిగింది. అతని తమ్ముడి.. అనారోగ్య కారణంగా చనిపోయాడు. అతని తమ్ముడు చివరి రోజుల్లో నేను దగ్గరే ఉన్నా. నా బాయ్ ఫ్రెండ్ వాళ్ల తమ్ముడు నా కళ్ల ముందే చనిపోయాడు. చివరి కార్యక్రమాలు అన్నీ పూర్తయ్యే వరకు నా బాయ్ ఫ్రెండ్‌కి తోడుగా ఉన్నాను అని తెలిపింది. తమ్ముడు చనిపోవడంతో అతను ఊర్లో ఉండిపోవాలని నిర్ణయించుకున్నాడు. సొంతూరిలోనే తల్లదండ్రులకు తోడుగా ఉండిపోయాడు. నేను ఇక్కడ హైదరాబాద్ లో ఉండాల్సి వచ్చింది. తప్పని పరిస్థితుల్లో ఇద్దరం విడిపోవాల్సి వచ్చింది. అయితే తనతో పాటు నన్ను కూడా ఊరికి తీసుకెళ్లపోతే నా కెరీర్ నాశనం అవుతుందని అతను అనుకున్నాడు. నాకు ఆ విషయం చాలా రోజుల తర్వాత తెలిసింది. అప్పుడే తెలుసుంటే అతనితో వెళ్లిపోయేదాన్నేమో.. అని చెప్పుకొచ్చింది దివి.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి