సాధారణం గా చిత్ర పరిశ్రమకు ఎంతో మంది హీరో హీరోయిన్లు వస్తూ ఉంటారు పోతూ ఉంటారు. కానీ కొంతమంది హీరోయిన్లు మాత్రం తమ నటనతో తమ అందం అభినయంతో ప్రేక్షకుల హృదయాల్లో ప్రత్యేకమైన స్థానం సంపాదించుకుంటూ ఉంటారు అనే విషయం తెలిసిందే. అలాంటి హీరోయిన్లు ఇండస్ట్రీకి దూరమైనప్పటికీ ప్రేక్షకులు మాత్రం ఎప్పుడూ తలుచుకుంటూనే ఉంటారు. అలాంటి వారిలో ఇలియానా కూడా ఒకరు. దేవదాస్ అనే సినిమాతో టాలీవుడ్లోకి హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చింది ఈ ముద్దుగుమ్మా. ఇక మొదటి సినిమాతోనే తన అందం అభినయంతో తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకుంది అని చెప్పాలి.


 అయితే ఆ తర్వాత కాలం లో మాత్రం వరుస ఫ్లాప్ లతో సతమతమైన ఈ ముద్దుగుమ్మ.. టాలీవుడ్ ను కాస్త దూరం గా పెట్టింది  ఇక బాలీవుడ్లో తన అదృష్టాన్ని పరీక్షించుకోవాలని అనుకుంది. అక్కడ దడపా అవకాశాలు అందుకుంది. కానీ పెద్దగా కెరియర్ మాత్రం పుంజుకోలేదు. దీంతో ఇక సినిమాలకు పూర్తిగా దూరమైపోయింది ఈ ముద్దుగుమ్మ   ఆ తర్వాత కాలంలో ఇక కాస్త బొద్దుగా మారడంతో అవకాశాలు కూడా రాలేదు. అయితే ఇక పెళ్లి కాకముందే అభిమానులు అందరికీ కూడా షాక్ ఇచ్చింది ఇలియానా. ఇటీవల బిడ్డకు కూడా జన్మనిచ్చింది అన్న విషయం తెలిసిందే. ఇకపోతే ఎప్పుడు సోషల్ మీడియా లో యాక్టివ్ గా ఉండే ఇలియానా తాను డిప్రెషన్ తో బాధపడుతున్నట్టు అభిమానుల తో పంచుకుంది. ప్రసవం తర్వాత డిప్రెషన్ తో బాధపడుతున్నట్లు తెలిపింది. ఇక అదో భావోద్వేగా పూరితమైన ప్రయాణం. నిద్రలేమి సమస్య వేధిస్తుంది. అందులో నుంచి బయట పడేందుకు ఇంకా ఎంతగానో కష్టపడి పోతున్న. నిత్యం వర్కౌట్స్ చేస్తున్నా. కొన్ని సందర్భాలలో సమయం దొరకక పోయినప్పటికీ మునుపటిలా జీవించేందుకు ప్రయత్నిస్తున్నా. ఈ విషయం లో నా కుటుంబం నాకు ఎంతో అండగా నిలుస్తుంది అంటూ ఇలియానా ఇటీవల చెప్పుకొచ్చింది.

మరింత సమాచారం తెలుసుకోండి: