టాలీవుడ్ ఇండస్ట్రీలో రౌడీ హీరో విజయ్ దేవరకొండ నేషనల్ క్రష్ రష్మిక మందనకు ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. వీరిద్దరూ కాంబినేషన్లో వచ్చిన మొదటి సినిమా గీత గోవిందం బ్లాక్ బస్టర్ సక్సెస్ అందుకోవడంతో వీరిద్దరికి కాంబోపై ప్రేక్షకుల్లో మంచి క్రేజ్ ఏర్పడింది.ఈ సినిమా తర్వాత మరోసారి డియర్ కామ్రేడ్ సినిమాలో కలిసి నటించారు. ఈ సినిమా కూడా పాజిటివ్ టాక్ తెచ్చుకుంది. తర్వాత వీరిద్దరి కాంబినేషన్ లో మరో సినిమా వస్తే బాగుండు అని ఎంతో మంది ప్రేక్షకులు ఇప్పటికీ ఎదురుచూస్తున్నారు. అయితే త్వరలోనే వీరిద్దరు కాంబోలో సినిమా రాబోతున్నట్లు సమాచారం. తాజాగా రష్మిక మందన టోక్యోలో జరగనున్న క్రంచి అని అవార్డ్స్ వేడుకలో సందడి చేసేందుకు జపాన్ కు వెళ్ళింది. ఈ నేపథ్యంలో ఆమె ఇచ్చిన ఇంటర్వ్యూలో విజయ్ దేవరకొండ తో మరో సినిమా చేసేందుకు రెడీగా ఉన్నాను అంటూ వివరించింది.మేమిద్దరం కలిసి నటించే సినిమా కోసం ప్రేక్షకులు ఎదురుచూస్తున్నారని నాకు తెలుసు.. మేమిద్దరం కూడా ఆ స్క్రిప్ట్ కోసమే ఎదురు చూస్తున్నాం. మంచి కథ దొరికితే కచ్చితంగా మా ఇద్దరి కాంబోలో మరో సినిమా వస్తుంది అంటూ రష్మిక వివరించింది. గీతగోవిందంతో సక్సెస్ అందుకున్న ఈ జంట డియర్ కామ్రేడ్ సినిమాలో మరోసారి అదరగొట్టారు. ఇక వీరిద్దరికీ ఉన్న క్రేజ్ రిత్య తరచు వార్తలో వైరల్ అవుతూనే ఉంటారు. వీరిద్దరూ ప్రేమలో ఉన్నారంటూ పలు వార్తలు వినిపిస్తూనే ఉంటాయి. ఇక తాజాగా రష్మిక  పేజ్‌లో విజయ్ దేవరకొండ పిక్ తో భర్త అంటే వీడిలా ఉండాలి.. ఆమెను ప్రొటెక్ట్ చేయాలి.. క్వీన్ లాంటి ఆమెను కింగ్ లా చూసుకునే భర్త వీడు అంటూ ఒక అభిమాని కామెంట్ చేశాడు. దానిపై రష్మిక స్పందిస్తూ అవును అది నిజం అంటూ వివరించింది. దీంతో వీరిద్దరూ ప్రేమలో ఉన్నారంటూ అభిమానులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

పలుసార్లు రష్మిక, విజయ్ కలిసి ట్రిప్స్ ఎంజాయ్ చేస్తూ కూడా బయట కనిపించడంతో.. వీరిద్దరి మధ్య ఎఫైర్‌ నడుస్తుందంటూ వార్తలు వైరల్ అయ్యాయి. ఇక ప్రస్తుతం రష్మిక మందన ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా సుకుమార్ డైరెక్షన్లో తెరకెక్కుతున్న పుష్పా సిక్వెల్ పుష్ప ది రూల్‌లో హీరోయిన్ గా నటిస్తుంది. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్లో బిజీగా ఉంది రష్మిక. ఇక ఆగస్టు 15న ఈ సినిమా ప్రేక్షకులు ముందుకు రానుంది. మరో పక్క విజయ్ దేవరకొండ ఫ్యామిలీ స్టొరీ సినిమాల్లో హీరోగా నటిస్తున్నాడు. పరశురామ్ డైరెక్షన్లో వస్తున్న ఈ సినిమాలో మృణాల్‌ ఠాగూర్ హీరోయిన్. ఈ సినిమా ఏప్రిల్ 5న ప్రేక్షకులు ముందుకు రానుందట. అయితే విజయ్ దేవరకొండ నటిస్తున్న ఈ సినిమాలో రష్మిక గెస్ట్ రోల్ లో కనిపించబోతుందంటూ తెలుస్తుంది. ఈ నేపథ్యంలో విజయ్ రష్మిక కాంబో మరోసారి ప్రేక్షకుల ముందుకు రాబోతుందని ఫ్యాన్స్ ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: