టాలీవుడ్ సీనియర్ స్టార్ హీరో విక్టరీ వెంకటేష్ హీరో గా మోస్ట్ బ్యూటిఫుల్ అండ్ వెరీ టాలెంటెడ్ నటిమని శ్రద్ధ శ్రీ నాథ్ హీరోయిన్ గా శైలేష్ కొలను దర్శకత్వంలో సైంధవ్ అనే సినిమా రూపొందిన విషయం మన అందరికీ తెలిసిందే. ఇకపోతే ఈ సినిమాలో తమిళ నటుడు ఆర్య ఈ కీలకమైన పాత్రలో నటించగా ... ఆండ్రియా ఈ మూవీ లో నెగిటివ్ షేడ్స్ ఉన్న పాత్రలో నటించింది. ఈ మూవీ ఈ సంవత్సరం సంక్రాంతి పండుగ సందర్భంగా జనవరి 13 వ తేదీన థియేటర్ లలో విడుదల అయింది. భారీ అంచనాల నడుమ విడుదల అయిన ఈ సినిమా సంక్రాంతి రెస్ లో అన్ని సినిమాల కంటే చివరి స్థానంలో నిలిచింది.

ఇలా బాక్స్ ఆఫీస్ దగ్గర ప్రేక్షకులను అలరించడంలో ఘోరంగా విఫలం అయిన ఈ సినిమా ఆ తర్వాత కొన్ని రోజులకే డిజిటల్ ప్లాట్ ఫామ్ లోకి కూడా ఎంట్రీ ఇచ్చింది. ఇకపోతే థియేటర్ ప్రేక్షకులను అలరించడంలో విఫలం అయిన ఈ సినిమా "ఓ టి టి" ప్రేక్షకులను కూడా పెద్దగా అలరించలేకపోయింది. అలా థియేటర్ మరియు" ఓ టి టి" ప్రేక్షకులను అలరించడంలో విఫలం అయిన మరి కొన్ని రోజుల్లోనే వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్ గా బుల్లి తెర ప్రేక్షకులను అలరించడానికి రెడీ అయింది.

మూవీ యొక్క శాటిలైట్ హక్కులను ప్రముఖ టీవీ సంస్థలలో ఒకటి అయినటువంటి ఈ టీవీ సంస్థ దక్కించుకుంది. అందులో భాగంగా ఈ సినిమాను వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్ గా మార్చి 17 వ తేదీన ఆదివారం రోజు సాయంత్రం 6 గంటలకు ప్రసారం చేయనున్నట్లు ఈ టీవీ సంస్థ వారు తాజాగా అధికారికంగా ప్రకటించారు. మరి ఈ సినిమా బుల్లి తెర ప్రేక్షకులను ఏ స్థాయిలో అలరిస్తోంది అనే విషయం తెలియాలి అంటే మరికొన్ని రోజులు వేచి చూడాల్సిందే.

మరింత సమాచారం తెలుసుకోండి: