శక్తిమాన్.. ఈ సీరియల్ టీవీలో ప్రసారమై దాదాపు దశాబ్దాలు గడిచిపోతున్నాయి. కానీ ఇప్పటికి కూడా ఈ సీరియల్  ఇచ్చిన మధురానుభూతులను ప్రేక్షకులు అస్సలు మర్చిపోలేరు. ఎందుకంటే ఇప్పుడు అంటే అవెంజర్స్ అంటూ ఎన్నో సూపర్ హీరో మూవీస్ చూసేస్తూ ఉన్నారు. కానీ సూపర్ మాన్, స్పైడర్ మాన్, ఐరన్ మ్యాన్ అంటూ ఎంతో మంది సూపర్ హీరోల గురించి అందరికీ తెలుసు. కానీ ఇక 90 కిడ్స్ కి మాత్రం తెలిసిన సూపర్ మాన్ ఎవరు అంటే కేవలం శక్తిమాన్ మాత్రమే. అప్పట్లో బుల్లితెరపై విశేషమైన ఆదరణను సొంతం చేసుకున్న శక్తిమాన్ మూవీ.. ఇక ఎంతలా సూపర్ హిట్ అయిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.


 ఈ సీరియల్ ప్రారంభమైంది అంటే చాలు ఇక ఎన్ని పనులున్న పక్కన పెట్టేసి ప్రేక్షకులందరూ టీవీలకు అతుక్కుపోయేవారు. అంతలా సక్సెస్ అయింది. ఇక ఈ సీరియల్ లో  ముఖేష్ కన్నా శక్తి మాన్ పాత్రలో నటించి కోట్లాదిమంది ప్రేక్షకుల హృదయాలలో ప్రత్యేకమైన స్థానం సంపాదించుకున్నాడు. 1997 నుంచి 2005 మధ్యకాలంలో ఇక ఈ సీరియల్ ప్రస్తారమైంది అని చెప్పాలి. ఇక ఇప్పుడు ఇలా శక్తిమాన్ ని సినిమాగా తీసేందుకు రెడీ అయ్యారు. ఇక ఇందులో బాలీవుడ్ స్టార్ రణబీర్ సింగ్ హీరోగా నటించబోతున్నాడు అంటూ వార్తలు వస్తున్నాయి. ఇదే విషయంపై శక్తిమాన్ సీరియల్ లో ప్రధాన పాత్రలో నటించిన ముఖేష్ ఖన్నా  స్పందిస్తూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.


 రణవీర్ సింగ్ లాంటి హీరోతో శక్తిమాన్ ను సినిమాగా తెరకెక్కించడంపై తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేశాడు ముఖేష్ కన్నా. శక్తిమాన్ అంటే కేవలం ఒక సూపర్ హీరో మాత్రమే కాదు.. ఒక టీచర్ ఆ పాత్ర చేసే వ్యక్తి. ఇక శక్తిమాన్ పాత్రలో ఏదైనా చెబితే పదిమంది వినేలా ఉండాలి. కానీ బాలీవుడ్ స్టార్ హీరో రణవీర్ సింగ్ కు ఉన్న ఇమేజ్ ఇక ఈ పాత్రకు అడ్డు వచ్చే అవకాశం ఉంది అంటూ ముఖేష్ కన్నా చెప్పుకొచ్చాడు. అందుకే శక్తిమాన్ సినిమాలో అటు రణవీర్ సింగ్ ని కాకుండా మరొకరిని హీరోగా పెట్టి తీస్తే బాగుంటుంది అంటూ అభిప్రాయం వ్యక్తం చేశాడు ముఖేష్ కన్నా.

మరింత సమాచారం తెలుసుకోండి: