ఈ క్రమంలో మృణాల్ ఠాకూర్ తన సోషల్ మీడియాలో ఆసక్తికర పోస్ట్ చేసింది. నేడు మధ్యాహ్నం మృణాల్ ఠాకూర్ హైదరాబాద్ లోని బల్కంపేట ఎల్లమ్మ ఆలయాన్ని దర్శించుకుంది. ఆ ఫోటోలు, వీడియోలు ఇన్‌స్టాగ్రామ్ లో షేర్ చేసింది.ఆలయం వద్ద పూజలు మృణాల్ ఫోటోలు, వీడియో షేర్ చేస్తూ.. ఏదన్నా కొత్తగా లేదా పెద్దగా మొదలుపెట్టేముందు పూజ చేయమని మా పేరెంట్స్ ఎప్పుడూ చెప్తారు. కుదిరితే గుడికి కూడా వెళ్ళమని, ఇది ఎప్పుడూ గుర్తుంచుకొమ్మని చెప్తారు. అందుకే ఫ్యామిలీ స్టార్ సినిమా ప్రమోషన్స్ మొదలుపెట్టేముందు ఫ్యామిలి స్టార్ ఫ్యామిలీతో హైదరాబాద్ లోని బల్కంపేట ఎల్లమ్మ టెంపుల్ ని దర్శించి ఆశీర్వాదాలు తీసుకున్నాను అని తెలిపింది. దీంతో మృణాల్ పోస్ట్ వైరల్ గా మారింది. పద్దతిగా వచ్చి, గుళ్లో పూజలు చేయడంతో మృణాల్ మన ట్రెడిషన్స్ ని ఫాలో అవుతుందని అభిమానులు, నెటిజన్లు అభినందిస్తున్నారు .
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి