యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ ప్రస్తుతం కొరటాల శివ దర్శకత్వంలో రూపొందుతున్న దేవర మూవీ లోను , హృతిక్ రోషన్ హీరోగా రూపొందుతున్న వార్ 2 మూవీ లలో హీరోగా నటిస్తున్నాడు. ప్రస్తుతం ఈ రెండు మూవీల షూటింగ్ ఫుల్ స్పీడ్ గా జరుగుతుంది. ఇక ఇప్పటికే ఎన్టీఆర్ , ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ఓ మూవీ కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన విషయం మనకు తెలిసిందే. ఈ మూవీ కి సంబంధించిన అధికారిక ప్రకటన కూడా చాలా రోజుల క్రితమే వెలువడింది. ఈ సినిమాను మైత్రి సంస్థ వారు నిర్మించబోతున్నారు.

ఇకపోతే మే 20 వ తేదీన ఎన్టీఆర్ పుట్టిన రోజు అన్న విషయం మన అందరికీ తెలిసిందే. ఈ సంవత్సరం ఎన్టీఆర్ పుట్టిన రోజు సందర్భంగా ప్రస్తుతం ఎన్టీఆర్ నటిస్తున్న రెండు సినిమాలకు సంబంధించి అలాగే నటించబోయే ఒక సినిమాకు సంబంధించిన అప్డేట్లను విడుదల చేయనున్నారు. మరి ఎన్టీఆర్ పుట్టిన రోజు సందర్భంగా ఈ మూడు సినిమాలకు సంబంధించి ఎలాంటి అప్డేట్లు రాబోతున్నాయి అనే వివరాలను తెలుసుకుందాం. ఎన్టీఆర్ హీరోగా రూపొందుతున్న దేవర మూవీ ని ఈ సంవత్సరం అక్టోబర్ 10 వ తేదీన విడుదల చేయనున్నారు.

దానితో ఎన్టీఆర్ అభిమానులు ఈ సినిమా ఫస్ట్ సింగిల్ గురించి ఎన్నో రోజులుగా ఎదురు చూస్తున్నారు. ఇక మే 20 వ తేదీన మేకర్స్ ఈ సినిమాలోని మొదటి పాటను విడుదల చేయబోతున్నట్లు తెలుస్తోంది. అలాగే దేవర మూవీ నుండి ఓ పోస్టర్ ను కూడా విడుదల చేయబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఇలా వార్ 2 యూనిట్ ఎన్టీఆర్ పుట్టిన రోజు సందర్భంగా ఈ సినిమా నుండి ఎన్టీఆర్ ఫస్ట్ లుక్ పోస్టర్ ను విడుదల చేయబోతున్నట్లు తెలుస్తోంది. అలాగే ఎన్టీఆర్ , ప్రశాంత్ నీల్ కాంబో మూవీ మే 20 వ తేదీన స్టార్ట్ కాబోతున్నట్లు తెలుస్తోంది. ఇలా ఈ మూడు మూవీలకు సంబంధించి మూడు అదిరిపోయే అప్డేట్లు ఎన్టీఆర్ పుట్టిన రోజు సందర్భంగా ఉండబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: