హీరో అవ్వాలంటే ఆయన స్సెషల్ గా ఉండాలి. హైట్, వెయిట్, ఫిజిక్, అందం అన్నీ కూడా స్పెషల్ గా ఉండాలి. తనకంటూ స్పెషల్ లుక్ ఉండాలి అనుకుంటారు.మామూలు వ్యక్తిలాగా ఉంటే పెద్దగా పట్టించుకోరు. నటుడు కావాలంటే నటన వస్తే చాలు కానీ హీరో అవ్వాలంటే మాత్రం పైన చెప్పినా అన్ని అంశాలు ఉండాల్సిందే అనే బ్రమలో ఉంటారు చాలా మంది. కానీ ఇవన్నీ తప్పని నిరూపించారు ఓ హీరో. ఇంతకీ అతను ఎవరు? ఎలా నిరూపించారు అనే వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.

ఆ పాత్రను చూస్తున్నంత సేపు హీరో కాకుండా పాత్ర మాత్రమే చూడాలి అనిపిస్తుంది. పాత్ర చుట్టూనే సినిమా తిరుగుతుంది అనిపించేంతలా నటించాలి. మొత్తం మీద పాత్రకు న్యాయం చేయాలి. అప్పుడే హీరో అవుతారు. అంతేకానీ సన్నగా ఎత్తుగా ఉంటే మాత్రమే హీరో అనిపించుకోరు అని ఈ హీరోను చూస్తే అర్థం అవుతుంది. దీన్ని నిరూపించారు సౌబిన్ షాహిర్. ఇతను చాలా కొద్ది మందికి మాత్రమే తెలుసు. కొందరికి తెలియకపోవచ్చు. కానీ మనిషిని చూస్తే మాత్రం కచ్చితంగా గుర్తు పడతారు.

కొన్ని సినిమాల్లో సహాయ పాత్రల్లో నటించారు. 2018లో వచ్చిన సుడాని ఫ్రం నైజీరియా అనే సినిమాలో హీరోగా నటించి మెప్పించారు. ఈ సినిమా పెద్ద హిట్ అవడం మాత్రమే కాదు టాలెంట్ ఉంటే ఎలాంటి వారు అయినా హీరో అవచ్చు అని నిరూపించారు. ఆ తర్వాత కుంబలంగి నైట్స్ అనే సినిమా వచ్చింది. ఈ సినిమాలో సాబిన్ షాహిర్ ను ఇండియా మొత్తం మెచ్చుకుంది. ఇది 2019లో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అప్పటి నుంచి చాలా మందికి ఈయన అభిమాన హీరో అయ్యారు.

గత సంవత్సరంలో రోమాంచం సినిమాలో హీరోగా నటించారు ఈయన. ఈ సినిమాను తెలుగు ప్రేక్షకులు కూడా ఆదరించారు. ఇటీవల మంజుమ్మిల్ బాయ్స్ అనే సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెలిసిందే. దీన్ని స్వయంగా ఈయనే నిర్మించారు. ఈయన ఓటీటీలో రిలీజ్ అయిన ఎన్నో మలయాళ సినిమాలకు తెలుగు డబ్బింగ్ సినిమాలు చేస్తూ ఫేమస్ అయ్యారు. మొత్తం మీద హీరో అన్న పదానికి అర్థం మార్చి హీరో పాత్రకు న్యాయం చేసి సినిమాను తన భుజాల మీద నడిపించాలి అని నిరూపించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: