జూనియర్ ఎన్టీఆర్ ప్రస్తుతం దేవర అనే సినిమాలో హీరోగా నటిస్తున్న విషయం మనకు తెలిసిందే. ఈ సినిమా రెండు భాగాలుగా విడుదల కానుంది. అందులో మొదటి భాగాన్ని ఈ సంవత్సరం అక్టోబర్ 10 వ తేదీన విడుదల చేయనున్నారు. ఈ సినిమా విడుదల తేదీ దగ్గర పడడంతో నిన్న అనగా మే 20 వ తేదీన ఎన్టీఆర్ పుట్టిన రోజు కావడంతో అందుకు ఒక రోజు ముందుగానే ఈ సినిమా నుండి ఫియర్ అంటూ సాగే సాంగ్ ను విడుదల చేశారు.

మొదటి నుండి ఈ సాంగ్ అదిరిపోయి రేంజ్ లో ఉండబోతుంది అని అనేక మంది సినీ ప్రముఖులు చెబుతూ రావడంతో ఈ సాంగ్ పై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు ఏర్పడ్డాయి. అలా భారీ అంచనాల నడుమ విడుదల అయిన ఈ సాంగ్ కి సూపర్ సాలిడ్ రెస్పాన్స్ జనాల నుండి లభించింది. కాకపోతే ఈ సాంగ్ అనేక పాత రికార్డులను బద్దలు కొడుతుంది అని చాలా మంది అనుకున్నారు. కానీ ఆ స్థాయిలో మాత్రం ఈ సాంగ్ ఇంపాక్ట్ ను చూపించలేకపోయింది.

మరి ఈ సాంగ్ కి విడుదల అయిన 24 గంటల సమయంలో ఎన్ని వ్యూస్ , లైక్స్ వచ్చాయి అనే వివరాలను తెలుసుకుందాం. పియర్ సాంగ్ కి విడుదల అయిన 24 గంటల్లో 5.19 మిలియన్ వ్యూస్ , 473 కే లుక్స్ లభించాయి. ఓవరాల్ గా చూసుకుంటే ఈ సాంగ్ కి మంచి రెస్పాన్స్ లభించినప్పటికీ ఈ సాంగ్ అనేక పాత రికార్డులను బద్దలు కొడుతుంది అని చాలా మంది అనుకున్నారు.

ఆ విషయంలో మాత్రం ఈ సాంగ్ అంతగా సక్సెస్ కాలేక పోయింది. మరి ఈ సాంగ్ వినగా వినగా జనాలకు నచ్చి ఆ తర్వాత బ్లాక్ బాస్టర్ సాంగ్ అవుతుందేమో చూడాలి. కొరటాల శివ ఈ సినిమాకు దర్శకత్వం వహించగా , జాన్వి కపూర్మూవీ లో హీరోయిన్ గా నటించింది. సైఫ్ అలీ ఖాన్ విలన్ పాత్రలో నటించిన ఈ మూవీ కి అనిరుద్ రవిచంద్రన్ సంగీతం అందించాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: