స్టార్ హీరోయిన్స్ సోషల్ మీడియా పుణ్యమా అని విపరీతంగా ట్రోల్స్ బారిన పడుతున్నారు. మొన్నీమధ్య డీప్ ఫేక్ వీడియోలు సంచలనం సృష్టించాయి. స్టార్ హీరోయిన్ రష్మిక మందన్న కు సంబందించిన ఓ ఫేక్ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అయ్యింది.ఇటీవల కాలంలో సినిమా హీరోయిన్ల డీప్ ఫేక్ వీడియోలు ఎలాంటి సెన్షేషన్ ని క్రియేట్ చేశాయో తెలిసిందే. ఇప్పటికే పలువురు హీరోయిన్స్ డీప్ ఫేక్ వీడియోలు సోషల్ మీడియా అంతటా వైరల్ అయ్యాయి.ముఖ్యంగా ఆ మధ్య రష్మిక మందన డీప్ ఫేక్ వీడియో ఆయితే సినీ పరిశ్రమలో సంచలనంగా మారింది.నేషనల్ క్రష్ రష్మిక టార్గెట్‌గా మరో ఫేక్ వీడియోను క్రియేట్ చేశారు ఆగంతకులు. రెడ్ బికినీలో ఉన్న రష్మిక డీప్ ఫేక్ వీడియో నెట్టింట చక్కర్లు కొడుతుంది. ఇది వరకే రష్మికకు సంబంధించిన ఓ డీప్ ఫేక్ వీడియో సంచలనం రేపింది. అప్పట్లో ఈ ఘటనపై ఎంతో మంది ప్రముఖులు స్పందించారు.సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఈ వీడియోలో నటి రష్మిక రెడ్ బికినీలో స్నానం చేస్తున్నట్లుగా కనిపిస్తుంది. ఇది డీప్ ఫేక్ వీడియోగా గుర్తించారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సహాయంతో ఈ డీప్ ఫేక్ వీడియో క్రియేట్ చేశారు.

రెడ్ బికినీలో జలపాతం వద్ద నిల్చుని ఫోటోలకు పోజులిస్తున్నట్లుగా కనిపిస్తున్న ఈ వీడియో ఫేస్‌బుక్,ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌లో పోస్ట్ చేశారు. ఆ వీడియో కాస్త వెంటనే వైరల్ అయ్యింది. పోస్ట్ చేసిన వెంటనే లైక్స్, షేర్స్ విపరీతంగా వచ్చాయి. వీడియోను చూసిన వారంతా వీడియోలో ఉన్నది రష్మికనే అనుకుని ఒక్కసారిగా అవాక్కయ్యారు. నిజంగా రష్మిక వీడియోనే అని నమ్మేశారు. వాస్తవానికి అది డీప్ ఫేక్ వీడియో. ఫ్యాక్ట్ చెక్‌ చేయగా ఆ వీడియో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సహాయంతో క్రియేట్ చేసిందని తేలింది.

డీప్ ఫేక్ వీడియోలో వాడిన ఒరిజినల్ వీడియోను డానియెలా విల్లారియల్  అనే ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్‌లో పోస్ట్ చేశారు. కొలంబియాకు చెందిన ఓ కంటెంట్ క్రియేటర్‌కు సంబంధించిన వీడియో అది.గత ఏడాది యానిమల్ మూవీతో మరో బ్లాక్ బస్టర్ హిట్ తన ఖాతాలో వేసుకుంది రష్మిక,రణబీర్ కపూర్ హీరోగా వచ్చిన ఈ సినిమాకు.. సందీప్ రెడ్డి వంగా దర్శకుడు. ఈ సినిమాకు భారీ కలెక్షన్లు రావడంతో బాలీవుడ్‌లో టాప్ హీరోయిన్‌గా నిలిచింది. పుష్ప మూవీతో పాన్ ఇండియా ఇమేజ్‌ను సొంతం చేసుకున్న నేషనల్ క్రష్ రష్మిక ప్రస్తుతం పుష్ప 2తో పాటు,రెయిన్ బో,ద గర్ల్ ఫ్రెండ్ అనే చిత్రాలలో నటిస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: