అఖిల్.. నడవడం, మాట్లాడటం రాని రోజుల్లోనే హీరో అయ్యాడు. తన బోసి నవ్వులతో, అల్లరి చేష్టలతో తెలుగు ప్రేక్షకుల మనసులో 'సిసింద్రీ'గా చెరగని ముద్ర వేసుకున్నాడు.అక్కినేని మూడో తరం నట వారసుడిగా 'అఖిల్' సినిమాతో ఇండస్ట్రీలో అడుగు పెట్టాడు అఖిల్ అక్కినేని. ఆ సినిమా ఆశించినంత విజయం సాదించనప్పటికీ అఖిల్ స్క్రీన్ ప్రెజన్స్ కి మంచి మార్కులే పడ్డాయి. ఫస్ట్ సినిమాతోనే తన డాన్సులతో ఫైట్స్ తో అదరగొట్టేసాడు.ఆ తర్వాత అక్కినేని ఫ్యామిలీకి 'మనం' లాంటి చిత్రాన్ని అందించిన విక్రమ్ కుమార్ డైరెక్షన్ లో రెండో సినిమాగా 'హలో' చిత్రంలో నటించాడు. ఈ సినిమా నటుడిగా మంచి గుర్తింపు తెచ్చినప్పటికీ మాస్ ఆడియన్స్ కోరుకొనే ఎలిమెంట్స్ లేకపోవడంతో సెన్సిబుల్ సినిమాగా మిగిలిపోయింది.మూడో సినిమాగా వచ్చిన మిస్టర్ మజ్ను కూడా అఖిల్ ని నిలబెట్టలేకపోయింది.అఖిల్ బ్లాక్ బస్టర్ హిట్ కోసం ఎంత ప్రయత్నించినా ఆ ఒక్కటి మాత్రం రావడం లేదు. టాలెంటెడ్ ద‌ర్శ‌కుల‌తో ప‌ని చేసినా కూడా.. సినిమాల‌కు పాజిటివ్ టాక్ వ‌చ్చినా కూడా ఇప్ప‌టి వ‌ర‌కు సూపర్ హిట్ మాత్రం రాలేదు.

వివి వినాయక్ లాంటి స్టార్ డైరెక్టర్ తో లాంచ్ అయినప్పటికీ.. సక్సెస్ ను మాత్రం అందుకోలేకపోయాడు. ప్రస్తుతం ఓ హిట్ సినిమా కోసం ఎదురుచూస్తున్నాడు ఈ అక్కినేని హీరో. ఈ క్రమంలోనే అఖిల్ లేటెస్ట్ లుక్ అభిమానులను షాక్ కు గురిచేసింది. ఆ లుక్ కు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్ గా మారింది.ప్రస్తుతం టాలీవుడ్ లో ఓ హిట్ కోసం ఎదరుచూసే హీరోల్లో అక్కినేని అఖిల్ ఒకడు. అఖిల్ కెరీర్ లో ఇప్పటి వరకు చేసిన సినిమాల్లో 'మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్' మాత్రమే హిట్ టాక్ ను తెచ్చుకుంది. బొమ్మరిల్లు భాస్కర్ డైరెక్ట్ చేసిన ఈ చిత్రంతో హిట్ ట్రాక్ ఎక్కుతాడని అందరూ భావించారు. కానీ ఆ తర్వాత డైరెక్టర్ సురేందర్ రెడ్డి తెరకెక్కించిన 'ఏజెంట్' భారీ డిజాస్టర్ గా నిలిచింది. దాంతో అక్కినేని ఫ్యాన్స్ తీవ్ర నిరాశలో కూరుకుపోయారు. అఖిల్ నుంచి సాలిడ్ హిట్ మూవీ కోసం వారు ఎంతో ఆశగా ఎదురుచూస్తున్నారు.అయితే తన నెక్ట్స్ సినిమాతో అభిమానుల కోరికను నెరవేర్చాలని ఆరాటపడుతున్నాడు అఖిల్. అందుకోసం తన గెటప్ ను పూర్తిగా మార్చినట్లు తెలుస్తోంది. తాజాగా అఖిల్ కు సంబంధించిన లేటెస్ట్ లుక్ సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. లాంగ్ హెయిర్, గుబురు గడ్డంతో.. స్టైలిష్ లుక్ లో కనిపించాడు. ఈ మేకోవర్ మెుత్తం తన నెక్ట్స్ మూవీ కోసమే అని టాక్. అయితే అఖిల్ నెక్ట్స్ మూవీ గురించి ఇంకా అప్డేట్ రాలేదు. కానీ ఈ రా లుక్ లో అఖిల్ హాలీవుడ్ హీరోలా ఉన్నాడని ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: