ఒకప్పుడు రొటీన్ కథలతో సినిమాలు తీసిన.. స్టార్ హీరోలను చూసి ప్రేక్షకులు థియేటర్లకు వెళ్లేవారు. దీంతో ఇలా రొటీన్ కథలతో వచ్చిన మూవీస్ కూడా బ్లాక్ బ్లాస్టర్లు కావడం జరిగేవి. కానీ ఈ మధ్యకాలంలో మాత్రం ప్రతి సినిమాలో ప్రేక్షకులు కొత్తదనాన్ని కోరుకుంటున్నారు. ఈ క్రమంలోనే ఎవరైనా డైరెక్టర్ హిట్టు కొట్టాలంటే కావాల్సింది.. స్టార్ హీరో హీరోయిన్ కాదు ఏకంగా మంచి కథ అని నమ్ముతున్నారు. దీంతో సరికొత్త కథలను రాసుకుంటూ ప్రేక్షకులను సర్ప్రైజ్ చేస్తూ ఉన్నారు. అయితే ఇలా ప్రేక్షకులను మెప్పించడానికి  హీరో హీరోయిన్లు కూడా ఎంతగానో కష్టపడి పోతున్నారు. ఏకంగా పాత్రలోకి పరకాయ ప్రవేశం చేయడం కోసం.. తమ బాడీని, తమ బాడీ లాంగ్వేజ్ ని కూడా మార్చుకుంటున్నారు అని చెప్పాలి.


 ఈ క్రమంలోనే కొంతమంది హీరోలు ఇలా పాత్రల కోసం తమని తాము మార్చుకున్న తీరు.. అభిమానులను సైతం ఆశ్చర్యానికి గురి చేస్తూ ఉంటుంది. ఇక ఇప్పుడు మనం మాట్లాడుకోబోయేది కూడా ఇలాంటి ఒక విలక్షణ నటుడు గురించే. ఎలాంటి సిని బ్యాక్గ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీకి ఎండ ఇచ్చి ఇప్పుడు తన సినిమాలతో ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకున్నాడు. ఇక విలక్షణమైన పాత్రలు చేస్తూ ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాడు. ఆయన ఎవరో కాదు హీరో శ్రీ విష్ణు. ఇక ఇప్పుడు ఏకంగా అభిమానుల సైతం గుర్తుపట్టలేనంతగా ముసలివాడిలా మారిపోయాడు ఈ టాలెంట్ హీరో. అతని ఫోటో చూసినా కూడా అభిమానులు గుర్తుపట్టలేక పోతున్నారు అనడంలో ఎలాంటి సందేహం లేదు.


 మొన్నటికి మొన్న ఓం భీమ్ బుష్ అనే సినిమాతో ఆడియన్స్ ని భయపెడుతూనే నవ్వించిన శ్రీ విష్ణు. ఇక ఇప్పుడు అదే స్యాగ్ లో మరో సినిమాలో నటిస్తున్నాడు. ఈ సినిమాకి కూడా స్వాగ్ అనే టైటిల్ పెట్టేసారు. హసీత్ గోలి దర్శకత్వంలో పీపుల్ మీడియా ఫ్యాక్టరీ పతాకంపై ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. ఈ మూవీకి సంబంధించి ఇటీవల వీడియో గ్లింప్స్ ని విడుదల చేశారు. ఇందులో శ్రీ విష్ణు భవభూతి అనే స్త్రీ ద్వేషి పాత్రలో కనిపించారు. ఇందులో అతని మేకోవర్ లుక్స్ చూసి ఆశ్చర్యపోతున్నారు ఆడియన్స్. ఏకంగా స్వాగ్ మూవీలో శ్రీ విష్ణు ఒక ముసలివాడి పాత్రలో కనిపించబోతున్నాడు. కేవలం ఒక పాత్రలో కాదు ఈ మూవీలో బోలెడు గెటప్పుల్లో కనిపించనున్నాడు అన్నది గ్లింప్స్ చూస్తేనే అర్థమవుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: