చాలా వరకు ఎక్కువ శాతం సినిమాలకు విడుదల మొదటి షో అయ్యాక రివ్యూలు వస్తూ ఉంటాయి. సినిమా బాగుంది, కథ బాగుంది, బ్లాక్ బస్టర్ సినిమా అంటూ రివ్యూస్ వస్తుంటాయి. కానీ కొంతమంది స్టార్ హీరోల సినిమాలకు మూవీ చిత్రీకరణ దశలో ఉండగా ఆ సినిమాలో పని చేస్తున్న వారి నుండి సినిమా చాలా బాగా వస్తుంది, కచ్చితంగా బ్లాక్ బాస్టర్ అని రివ్యూస్ వస్తుంటాయి. మరికొన్ని సినిమాలకు సెన్సార్ సభ్యుల నుండి రివ్యూ వస్తు ఉంటుంది. కానీ కొన్ని సినిమాలకు మాత్రమే స్టార్ట్ కాకముందే ప్రశంసలు కురుస్తుంటాయి.

ప్రస్తుతం అలాంటి సినిమాల జాబితాలో "ఆర్ సి 16" నిలుస్తోంది. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా జాహ్నవి కపూర్ హీరోయిన్గా ఉప్పెన దర్శకుడు బుచ్చిబాబు సనా దర్శకత్వంలో ఈ మూవీ రూపొందబోతుంది. ఈ మూవీకి సంబంధించిన పూజా కార్యక్రమాలు "ఆర్ సి 16" అనే వర్కింగ్ టైటిల్ తో ప్రారంభం అయ్యాయి. ఈ సినిమా షూటింగ్ ఆగస్టు నుండి ప్రారంభం కాబోతున్నట్లు తెలుస్తోంది. ఈ సినిమా చిత్రీకరణ స్టార్ట్ కాకముందే ఈ సినిమా కథపై అనేక మంది ప్రశంసలు కురిపిస్తున్నారు.

ఈ మూవీలో కన్నడ స్టార్ హీరోలలో ఒకరు అయినటువంటి శివరాజ్ కుమార్ ఓ కీలకమైన పాత్రలో కనిపించనున్నాడు. ఆయన ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ బుచ్చిబాబు, చరణ్ తో తీయబోయే సినిమాలో నేను నటించబోతున్నాను. నా పాత్ర అందులో అద్భుతంగా ఉండబోతుంది. అలాగే ఆ సినిమా స్టోరీ కూడా సూపర్ గా ఉంటుంది. విన్నప్పుడే నాకు అద్భుతంగా అనిపించింది. అది ఖచ్చితంగా బ్లాక్ బాస్టర్ అవుతుంది అని చెప్పాడు. ఇక తాజాగా విజయ్ సేతుపతినీ బుచ్చిబాబు తాజాగా ఇంటర్వ్యూ చేశాడు.

అందులో భాగంగా విజయ్ మాట్లాడుతూ... నువ్వు మరికొన్ని రోజుల్లో చరణ్ తో సినిమా చేయబోతున్నాం. ఆ సినిమా కథ గురించి నాకు మొత్తం తెలుసు. అది ఒక అద్భుతమైన కథ. ఖచ్చితంగా దానితో నువ్వు బ్లాక్ బాస్టర్ కొడతావు అని అన్నాడు. ఇలా సినిమా స్టార్ట్ కాకముందే ఆ మూవీ కథపై ఎంతో మంది ప్రశంసలు కురిపిస్తున్నారు. మరి ఇంత గొప్ప నటులు అలా చెబుతూ ఉండడంతో ఈ మూవీపై ప్రేక్షకుల్లో అంచనాలు భారీగా పెరిగిపోతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: