కథల విషయంలో ఆచితూచి అడుగులు వేస్తూ వస్తుంది రీతు వర్మ. గత ఏడాది అనువాద చిత్రం మార్క్ అంటోనీతో సినీ ప్రియులని అలరించిన ఈ తెలుగు హీరోయిన్ ప్రస్తుతం శ్రీ విష్ణు తో కలిసిస్వాగ్ లో నటిస్తున్న విషయం తెలిసిందే. ఇది ముగింపు దశ చిత్రీకరణలో ఉంది. కాగా రీతు వర్మ ఇప్పుడు తెలుగులో మరో అవకాశాన్ని దక్కించుకున్నట్టు సమాచారం. ఈ సినిమాలో హీరో సందీప్ కిషన్ తో రీతు వర్మ జతకట్టనుంది. దర్శకుడు నక్కిన త్రినాథ రావు ఇప్పుడు మంచి ఫామ్ లో వున్నారు. అతను, రచయిత బెజవాడ ప్రసన్న కుమార్ కాంబినేషన్ లో ఇంతకు ముందు రవితేజతో 'ధమాకా' అనే ఒక పెద్ద హిట్ సినిమా ఇచ్చారు.అంతకు ముందు నానితో 'నేను లోకల్' సినిమా కూడా చాలా పెద్ద హిట్ అయింది. మధ్యలో రామ్ పోతినేనితో 'హలో గురు ప్రేమకోసమే' కూడా వీళ్లిద్దరి కాంబినేషన్ లో వచ్చిందే. అయితే ఆ సినిమా యావరేజ్ అన్నారు.ఇలా వరస విజయాలతో దూసుకు వెళుతున్న దర్శకుడు నక్కిన త్రినాథ రావు, రచయిత బెజవాడ ప్రసన్న కుమార్ ఇప్పుడు సందీప్ కిషన్, రావు రమేష్ ప్రధాన పాత్రల్లో ఒక సినిమా రూపుదిద్దుకుంటోంది.రావు రమేష్ పక్కన ఒకప్పటి 'మన్మధుడు' కథానాయిక అన్షు అంబానీ చేస్తుండగా, సందీప్ కిషన్ పక్కన 'పెళ్లి చూపులు' భామ రీతు వర్మ చేస్తోంది అని సమాచారం.

సందీప్ కిషన్ పక్కన ముందు కొత్తమ్మాయిని తీసుకుందాం అని అనుకున్నా, ఎవరూ సెట్ కాలేదు. తరువాత రీతు వర్మ కి కథని వినిపించారు, ఆమెకి కథ నచ్చి ఒప్పుకుంది అని అంటున్నారు. అలాగే రీతు వర్మ కి పారితోషికం కూడా బాగానే ముట్టచెపుతున్నారు అని ఒక వినికిడి వస్తోంది. ఈ సినిమా చిత్రీకరణ నిన్ననే మొదలయ్యింది. మురళి శర్మ ఇంటి సెట్ లో ఈ చిత్రీకరణ మొదలయ్యింది, ఇందులో ప్రధాన పాత్రధారులు పాల్గొన్నారని తెలుస్తోంది. తండ్రి, కొడుకుల మధ్య జరిగే కథని వినోదాత్మకంగా ప్రసన్న రాస్తే, అది నక్కిన దర్శకత్వంలో తెరకెక్కుతోంది.ఇదిలా ఉండగా నక్కిన దర్శకత్వంలో వచ్చిన కథానాయికలు కూడా మంచి పేరు సంపాదించారు. శ్రీలీల, కీర్తి సురేష్, అనుపమ పరమేశ్వరన్ ఇలా అందరూ పనితో బిజీగా వున్నారు. ఇప్పుడు ఈ సినిమాలో చెయ్యబోయే రీతు వర్మకి కూడా ఆ అదృష్టం కలిసి వస్తుందని అనుకుంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: