‘క్రాక్’ నాంది’ వంటి చిత్రాలు వరుసగా హిట్ అవ్వడం అలాగే అందులో ఆమె నటనకు కూడా మంచి మార్కులు పడటమే దీనికి ప్రధాన కారణంగా చెప్పుకోవచ్చు. ఇప్పుడు టాలీవుడ్లో వరలక్ష్మీ డిమాండ్ బాగా పెరిగింది. నెగిటివ్ రోల్స్ లేదా కీలక పాత్రలను అవలీలగా పోషించడంలో ఈమె సిద్దహస్తురాలు కాబట్టి… ఇక్కడ ఈమె డిమాండ్ పెరిగింది. ఇక ఈమె సీనియర్ హీరో శరత్ కుమార్ కూతురన్న సంగతి తెలిసిందే.అలా అని అతని భార్య రాధిక కూతురు కాదు. మొదట శరత్ కుమార్… ఛాయా అనే ఆవిడని వివాహం చేసుకున్నారు. వారికి పుట్టిన అమ్మాయి వరలక్ష్మీ. కొన్నాళ్ల తరువాత శరత్ కుమార్ హీరోయిన్ రాధికను వివాహం చేసుకోవడంతో.. ఛాయ విడాకులు ఇచ్చినట్టు తెలుస్తుంది. కొన్నాళ్ల వరకూ వరలక్ష్మీ తన తల్లి వద్దే ఉండేదట. అటు తరువాత తండ్రి శరత్ కుమార్ వద్దకు వచ్చినట్టు తెలుస్తుంది. ప్రస్తుతం సినిమాల్లో బిజీగా ఉంటూ వస్తోన్న వరలక్ష్మీ.వారంలో కొద్దిరోజులు తండ్రి దగ్గర మరికొద్ది రోజులు తల్లి దగ్గర ఉంటుందట. ఆదివారం రోజున మాత్రం అందరూ కలుస్తారని తెలుస్తుంది. ప్రస్తుతం వరలక్ష్మీ తల్లి ఫోటో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.ఇదిలా ఉండగా.. త్వరలో అల్లు అర్జున్- కొరటాల శివ కాంబినేషన్లో రూపొందుతోన్న పాన్ ఇండియా చిత్రంలో వరలక్ష్మీ అవకాశం దక్కించుకున్నట్టు సమాచారం. ఈ చిత్రంలో ఈమె పొలిటికల్ లీడర్ గా కనిపించబోతున్నట్టు టాక్.క్రాక్, వీరసింహారెడ్డి, యశోద వంటి సినిమాల్లో లేడీ విలన్ గా తెలుగు ఆడియన్స్ కు దగ్గరైన కోలీవుడ్ నటి వరలక్ష్మీ శరత్ కుమార్ త్వరలోనే పెళ్లి పీటలు ఎక్కబోతుంది.ముంబైకి చెందిన వ్యాపారవేత్త, ఆర్ట్‌ గ్యాలరీల నిర్వాహకుడు నిచోలై సచ్‌దేవ్‌ని ఆమె త్వరలోనే పెళ్లాడనుంది. రీసెంట్ గా వీరిద్దరూ గ్రాండ్ గా ఎంగేజ్‌మెంట్ కూడా చేసుకున్నారు. జూలైలో వీరి వివాహం జరుగనున్నట్లు సమాచారం.

ఈ క్రమంలోనే వరలక్ష్మీ పెళ్ళికి సంబంధించి పనులు చక చకా జరుగుతున్నాయి. మరోవైపు వరలక్ష్మి ఇప్పటికే తమిళనాడులో ఉన్న పలువురు సినీ ప్రముఖులతో పాటు రాజకీయ ప్రముఖులను తన పెళ్ళికి ఇన్వైట్ చేయగా.. తాజాగా మన టాలీవుడ్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ను పెళ్ళికి ఆహ్వానించేందుకు స్వయంగా ఇంటికి వెళ్ళింది. ఈ సందర్భంగా అల్లు అర్జున్‌తో పాటు అతని తండ్రి అల్లు అరవింద్‌కు కూడా తన పెళ్లికి రమ్మని ఆహ్వానించింది.బన్నీకి వెడ్డింగ్ కార్డు ఇవ్వడానికి వరలక్ష్మి ప్రియుడు నిచోలై సచ్‌దేవ్ కూడా ఆమెతో రావడం విశేషం. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. కాగా వరలక్ష్మీ బన్నీ కంటే ముందు టాలీవుడ్ సెలెబ్రిటీలు అయిన.. రవితేజ, దర్శకుడు హరీష్ శంకర్, హనుమాన్ దర్శకుడు ప్రశాంత్ వర్మ, నటి సమంత, పైడిపల్లి వంశీ, తమన్, గోపిచంద్ మలినేని తదితరులను పెళ్ళికి ఇన్వైట్ చేసింది.

మరింత సమాచారం తెలుసుకోండి: