ఓటీటీ ఛానల్స్ పెరిగిపోవడంతో రకరకాల కంటెంట్ తో వెబ్ సిరీస్ ను నిర్మించి వాటిని ఓటీటీ ప్రేక్షకుల పై వదులుతున్నారు. కరోనా లాక్ డౌన్ సమయం నుండి ప్రేక్షకులు ఓటీటీ వెబ్ సిరీస్ కు విపరీతంగా అలవాటు పడ్డారు. వీటి పై ఎటువంటి సెన్సార్ లేకపోవడంతో మితిమీరిన హింసా మితిమీరిన శృంగారం మరీ ముఖ్యంగా వరసలు కూడ మర్చిపోయిన శృంగారం ఈవెబ్ సిరీస్ లలో కనిపిస్తూ ఉండటంతో యువత దీనికి బాగా ఆకర్షితులు అవుతున్నారు.ఇలాంటి పరిస్థితుల మధ్య లేటెస్ట్ గా విడుదలైన ‘మిర్జాపూర్ సీజన్ 3’ ట్రైలర్ కు వస్తున్న ఆదరణ చూస్తుంటే సమాజంలో నైతిక విలువలు ఎలా పతనం అవుతున్నాయో అర్థం అవుతుంది. వచ్చేనెల 5వ తారీఖు నుండి స్ట్రీమ్ కాబోతున్న ఈ వెబ్ సిరీస్ ట్రైలర్ ఇప్పుడు సోషల్ మీడియాలో ట్రెండింగ్ గా మారింది. ఈ వెబ్ సిరీస్ కు సంబంధించిన ట్రైలర్ కు విడుదలైన ఒక్కరోజు గడవకుండానే 7 మిలియన్ల వ్యూస్ రావడం హాట్ టాపిక్ గా మారింది.వాస్తవానికి మిర్జాపూర్ కంటెంట్ మీద ప్రారంభం నుంచి చాల విమర్శలు ఉన్నాయి. మితిమీరిన హింసతో పాటు విచ్చలవిడిగా బూతులు మాట్లాడించడం వరసలు మర్చిపోయిన శృంగార సంబంధాలు ఈ వెబ్  సిరీస్ కు ప్లస్ పాయింట్ గా మారింది. దీనితో ఈ వెబ్ సిరీస్ కొత్త సీజన్ ఎప్పుడు వస్తుందా అంటూ చాలామంది యూత్ జూలై 5వ తారీఖుకు కోసం ఎదురు చూస్తున్నారు.ఊరును గడగడా వణికించే ఒక పేరుమోసిన గూండా ఫ్యామిలీలో తాత, తండ్రి కొడుకులు కరుడుగట్టిన నేరస్థులైతే పరిస్థితులు ఎంత దారుణంగా ఉంటాయనే పాయింట్ చుట్టూ ఈ మాఫియా డ్రామా వెబ్ సిరీస్ కథ నడుస్తుంది. కలీన్ భయ్యాని కాదని నేర సామ్రాజ్యపు సింహాసనాన్ని గుడ్డు భాయ్ ఆక్రమించుకోవడానికి చేసే ప్రయత్నం చుట్టూ ‘మిర్జాపూర్ 3’ వెబ్ సిరీస్ కథ ఉంటుందని తెలుస్తోంది. హిందీ తెలుగుతో సహా అన్ని ప్రధాన భాషల్లో ‘మిర్జాపూర్ 3’ వెబ్ సిరీస్ అందుబాటలోకి రానుంది..  మరింత సమాచారం తెలుసుకోండి: