తెలుగు సినీ పరిశ్రమలో అత్యంత తక్కువ కాలంలో అద్భుతమైన గుర్తింపును సంపాదించుకొని వరుస సినిమాలలో అవకాశాలను దక్కించుకుంటున్న బ్యూటీలలో మీనాక్షి చౌదరి ఒకరు. ఈమె ఈచట వాహనంలో నిలపరాదు అనే సినిమాతో తెలుగు తెరకు పరిచయం అయింది. మోడలింగ్ రంగం నుండి సినిమా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన ఈ ముద్దుగుమ్మకు ఇచట వాహనములు నిలపరాదు మూవీ తో సక్సెస్ తగ్గలేదు. కానీ మంచి గుర్తింపు మాత్రం దక్కింది. ఆ తర్వాత ఈమె కిలాడి అనే సినిమాలో హీరోయిన్గా నటించింది. 

మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర బోల్తా కొట్టిన ఇందులో ఈమె తన అందాలను అదిరిపోయే రేంజ్ లో ఆరబోయడంతో ఈ బ్యూటీ కి ఈ మూవీ ద్వారా అద్భుతమైన క్రేజ్ లభించింది. ఈమె కొంత కాలం క్రితం అడవి శేషు హీరో గా రూపొందిన హిట్ ది సెకండ్ కేస్ అనే మూవీ లో హీరోయిన్గా నటించింది. ఈ మూవీ ద్వారా ఈమెకు మొట్ట మొదటి విజయం తెలుగు లో లభించింది. కొంత కాలం క్రితం మీనాక్షి చౌదరి , మహేష్ బాబు హీరోగా రూపొందిన గుంటూరు కారం సినిమాలో హీరోయిన్ గా నటించింది. ఇకపోతే ప్రస్తుతం ఈ నటి చేతిలో చాలా సినిమాలు ఉన్నాయి. 

అందులో భాగంగా ఈమె ప్రస్తుతం విశ్వక్ సేన్ హీరోగా రూపొందుతున్న మెకానిక్ రాఖీ మూవీ లోను , దుల్కర్ సల్మాన్ హీరోగా వెంకి అట్లూరి దర్శకత్వంలో రూపొందుతున్న లక్కీ భాస్కర్ సినిమాలోను హీరోయిన్ గా నటిస్తోంది. ఇకపోతే సినిమాలలో తన అదిరిపోయే హాట్ అందాలను ఆరబోస్తున్న ఈమె సోషల్ మీడియాలో అందుకు ఏ మాత్రం తగ్గడం లేదు. తాజాగా కూడా ఈమె అదిరిపోయే హాట్ లుక్ లో శారీని కట్టుకొని తన బ్యాక్ అందాలు ప్రదర్శితం అయ్యేలా ఫోటోలకు స్టిల్స్ ఇచ్చింది. ప్రస్తుతం ఆ ఫోటోలు వైరల్ అవుతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

mc