మాస్ మహారాజా రవితేజ నటిస్తున్న లేటెస్ట్ మూవీ 'మిస్టర్ బచ్చన్'. హరీశ్ శంకర్ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఈ మూవీని టాలీవుడ్ అగ్ర నిర్మాణ సంస్థ పీపుల్ మీడియా ఫ్యాక్టరీపై టీజీ విశ్వప్రసాద్ నిర్మిస్తున్నాడు.ఈ సినిమాలో మరాటి బ్యూటీ భాగ్యశ్రీ బోర్సే హీరోయిన్‌గా నటిస్తుండగా.. జగపతి బాబు, సత్య, సచిన్ ఖేడేకర్ ఇంకా నెల్లూరు సుదర్శన్ వంటి వారు కీలక పాత్రలు పోషస్తున్నారు. ఇప్పటికే ఈ మూవీ నుంచి విడుదలైన పోస్టర్లు, గ్లింప్స్ ఇంకా సాంగ్స్ సినీ ప్రియుల్లో సరికొత్త ఉత్సాహాన్ని నింపాయి.ముఖ్యంగా ఈ పాటలో హీరోయిన్ భాగ్యశ్రీ బోర్సే తన అందంతో ఆడియన్స్‌ను ఎంతగానో కట్టిపడేసింది. ఆమె నడుము ఒంపుసొంపులు చూపిస్తూ కుర్రకారును ఎంతగానో ఫిదా చేసింది. ఇంకా అంతేకాకుండా సాంగ్స్‌లో ఆమె ఎక్స్‌ప్రెసన్స్ అయితే అదిరిపోయాయనే చెప్పాలి. కాగా ఆమె టాలీవుడ్‌లో నటిస్తున్న మొదటి సినిమా ఇదే కావడంతో అందరి చూపు కేవలం ఆమెపైనే ఉన్నాయి. ఇదిలా ఉంటే ఈ సినిమా ఒక రీమేక్‌గా తెరకెక్కుతోంది. హిందీలో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిన రైడ్ సినిమాకు రీమేక్‌గా ప్రేక్షకుల ముందుకు వస్తుంది.ఈ మూవీలో రవితేజ ఇన్‌కం ట్యాక్స్ ఆఫీసర్‌గా కనిపించబోతున్నాడు. చాలా పవర్ ఫుల్ రోల్‌లో కనిపించనున్నాడు. ఇక ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలై రెండు సాంగ్‌లకు కూడా ఆడియన్స్ నుంచి సూపర్ డూపర్ రెస్పాన్స్ వచ్చింది. ఇక ఇప్పుడు మేకర్స్ మరో అప్డేట్ ని కూడా అందించారు. తాజాగా ఈ సినిమా నుంచి మరో సాంగ్‌ను కూడా రిలీజ్ చేశారు. 'జిక్కి' అంటూ సాగే మూడో పాటని విడుదల చేశారు. ఈ పాటలో రవితేజ, భాగ్యశ్రీ రొమాంటిక్ సన్నివేశాలు ఆడియన్స్‌ను ఆకట్టుకుంటున్నాయి.ముఖ్యంగా భాగ్యశ్రీ తన అందాలతో మాత్రం అదరగొట్టేసింది. వారిద్దరి కెమిస్ట్రీ అందరిలో కూడా క్యూరియాసిటీ రేపుతోంది. ఈ పాట కూడా ప్రస్తుతం యూట్యూబ్‌లో బాగా ట్రెండ్ అవుతోంది. మొత్తంగా ఈ మూవీ నుంచి విడుదలైన మూడు సాంగ్‌లకు అద్భుతమైన రెస్పాన్స్ వచ్చిందనే చెప్పాలి. మరి 'మిరపకాయ్' వంటి సినిమాతో రవితేజకు బ్లాక్ బస్టర్ హిట్ అందించిన దర్శకుడు హరీష్ శంకర్.. ఇప్పుడు 'మిస్టర్ బచ్చన్' సినిమాతో ఎలాంటి మ్యాజిక్ చేస్తాడో చూడాలి. ఈ మూవీ పాన్ ఇండియా లెవెల్లో ఆగస్టు 15న గ్రాండ్‌గా రిలీజ్ కానుంది.
ఇక ఈ
సినిమా పెయిడ్ ప్రీమియర్స్ ఆగస్ట్ 14 వ తేదీన సాయంత్రం 6 గంటల నుంచి స్టార్ట్ కానున్నాయి.