సూపర్ స్టార్ రజనీ కాంత్ పోయిన సంవత్సరం జైలర్ అనే మూవీ తో ప్రేక్షకుల ముందుకు వచ్చి అదిరిపోయే రేంజ్ బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకున్న విషయం మన అందరికీ తెలిసిందే. జైలర్ మూవీ తర్వాత రజినీ తన కూతురు ఐశ్వర్య రజనీ కాంత్ దర్శకత్వంలో రూపొందిన లాల్ సలామ్ సినిమాలో ఓ కీలకమైన పాత్రలో నటించాడు. ఈ మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర ఘోర పరాజయాన్ని ఎదుర్కొంది. ఇకపోతే ప్రస్తుతం రజనీ కాంత్ "జై భీమ్" మూవీ దర్శకుడు అయినటువంటి టీ జే జ్ఞానవేల్ దర్శకత్వంలో రూపొందుతున్న వెట్టయాన్ అనే సినిమాలో హీరో గా నటిస్తున్న విషయం మన అందరికీ తెలిసిందే.

మూవీ ని అక్టోబర్ 10 వ తేదీన విడుదల చేయనున్నట్లు తాజాగా ఈ మూవీ బృందం వారు అధికారికంగా ప్రకటించారు. ఇకపోతే ఈ సినిమాను అక్టోబర్ 10 వ తేదీనే తెలుగు లో కూడా విడుదల చేయబోతున్నట్లు తెలుస్తోంది. తాజాగా ఈ మూవీ కి సంబంధించిన సీడెడ్ ఏరియా మినహా రెండు తెలుగు రాష్ట్రాల హక్కులను ఈ మూవీ బృందం వారు అమ్మి వేసినట్లు తెలుస్తోంది. సిడెడ్ మినహా ఈ సినిమా యొక్క రెండు తెలుగు రాష్ట్రాల థియేటర్ హక్కులను ఓ ప్రముఖ సంస్థ వారు భారీ ధరకు కొనుగోలు చేసినట్లు తెలుస్తోంది.

అసలు విషయం లోకి వెళితే ... ఈ సినిమా యొక్క రెండు తెలుగు రాష్ట్రాల ధియేటర్ హక్కులను ఏషియన్ ఫిలింస్ సంస్థ వారు దక్కించుకున్నట్లు , వీరు ఈ మూవీ యొక్క సిడెడ్ హక్కులను మినహాయించి ఏపీ , తెలంగాణ రాష్ట్రాల హక్కులను ఏకంగా 14 కోట్ల భారీ ధరకు దక్కించుకున్నట్లు ఓ వార్త సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. మరి ఈ సినిమాపై తమిళ ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొని ఉండగా , తెలుగు ప్రేక్షకుల్లో పర్వాలేదు అనే స్థాయి అంచనాలు ఉన్నాయి. మరి ఈ మూవీ ఏ రేంజ్ అందుకని ఏ స్థాయి కలెక్షన్లను వసూలు చేస్తుందో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: