ఇక ఇప్పుడు ఈ లిస్టులో టాప్ లో ఉన్న సినిమా త్రిబుల్ ఆర్ .. ఈ సినిమా జపాన్లో ఏకంగా 8.23 వేల టిక్కెట్లు అమ్ముడైపోయాయి .. ఇక ఇప్పుడు ఈ రికార్డులు బ్రేక్ చేయడం అన్నది జవాన్ కి సాధ్యం కాదు . కానీ మొత్తంగా బిజినెస్ లో మిగతా సినిమాల రికార్డులను మాత్రం తిరగరాసే అవకాశం ఉందని ట్రేడ్ పండితులు అంచనా వేస్తున్నారు. ఇక పటాన్ - సలార్ తర్వాత ప్లేస్ లో జవాన్ వచ్చే అవకాశం ఉందంటున్నారు. మరి ఇది సాధ్యమవుతుందా లేదా అనేది తెలియాలంటే మరికొన్ని రోజులు వెయిట్ చేయాల్సిందే . అయితే సోషల్ మీడియాలో మాత్రం ప్రభాస్ వర్సెస్ షారుక్ ఖాన్ అభిమానుల మధ్య పెద్ద యుద్ధమే మొదలైంది. సలార్ రికార్డులను జవాన్ అధిగమిస్తుందని షారుక్ ఖాన్ అభిమానులు పోస్ట్లు పెడుతున్నారు..
ఇక దానికి దీటుగా ప్రభాస్ అభిమానులు సమాధానం ఇస్తున్నారు. ఇక జపాన్లో షారుక్ ఖాన్ ప్రభాస్ ఇద్దరికీ భారీ ఫాలోయింగ్ ఉంది. ప్రత్యేకంగా ప్రభాస్ కోసం జపాన్ నుంచి వచ్చే ఫ్యాన్స్ ఎంతోమంది ఉన్నారు. ఆయన పుట్టిన రోజు సందర్భంగా హైదరాబాద్ వచ్చి మరీ విషెస్ చెప్పిన డార్లింగ్ జపాన్ అభిమానులెంతో మంది. షారుక్ విషయంలోనూ పలు సందర్భాల్లో ఇలాంటి సన్నివేశాలు చోటు చేసుకున్నాయి. యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కి కూడా జపాన్ లో మంచి ఫాలోయింగ్ ఉన్న సంగతి తెలిసిందే.
క్లిక్ చేసి ఇండియాహెరాల్డ్ వాట్సాప్ చానెల్·ను ఫాలో అవ్వండి