టాలీవుడ్ ఇండస్ట్రీలో టాప్ డైరెక్టర్లలో ఒకరు అయినటువంటి త్రివిక్రమ్ శ్రీనివాస్ గురించి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. ఈయన కెరియర్ ప్రారంభంలో ఎన్నో సినిమాలకు కథ రచయితగా , మాటల రచయితగా , స్క్రీన్ ప్లే రైటర్ గా పని చేసి ఎన్నో విజయాలను అందుకొని అద్భుతమైన గుర్తింపును సంపాదించుకున్నాడు. ఇక ఆ తర్వాత కాలంలో ఈయన దర్శకుడిగా మారాడు. ఈయన దర్శకుడిగా అనేక సినిమాలకు దర్శకత్వం వహించాడు. అందులో చాలా మూవీలు మంచి విజయాలు సాధించడంతో ప్రస్తుతం త్రివిక్రమ్ శ్రీనివాస్ టాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ డైరెక్టర్లలో ఒకరిగా కెరీర్ను కొనసాగిస్తున్నాడు.

ఆఖరుగా త్రివిక్రమ్ శ్రీనివాస్ , మహేష్ బాబు హీరో గా రూపొందిన గుంటూరు కారం అనే సినిమాకు దర్శకత్వం వహించాడు. ఇకపోతే త్రివిక్రమ్ శ్రీనివాస్ తన తదుపరి మూవీ ని అల్లు అర్జున్ తో చేయబోతున్నాడు అని చాలా రోజులుగా వార్తలు వచ్చాయి. ఆ వార్తలకు తగినట్లుగానే అల్లు అర్జున్ అత్యంత దగ్గర సన్నిహితులు కూడా బన్నీ , త్రివిక్రమ్ కాంబోలో మూవీ ఉండబోతుంది అని చెప్పుకొచ్చారు. దానితో పుష్ప పార్ట్ 2 తర్వాత వీరి కాంబోలో మూవీ ఉంటుంది అని చాలా మంది భావించారు. కానీ పుష్ప 2 తర్వాత బన్నీ తన తదుపరి మూవీ ని అట్లీ తో చేయనున్నాడు. అందుకు సంబంధించిన అధికారిక ప్రకటన కూడా ఇప్పటికే విడుదల అయింది.

దానితో బన్నీ , త్రివిక్రమ్ కాంబోలో మూవీ స్టార్ట్ కావడానికి ఇంకా చాలా సమయం పట్టే అవకాశం ఉందని వార్తలు వస్తున్నాయి. దానితో త్రివిక్రమ్ మరో హీరోతో సినిమా చేయబోతున్నాడు అని అందులో భాగంగా వెంకటేష్ తో మూవీ సెట్ చేసుకున్నాడు అని వార్తలు వినిపించాయి. కానీ త్రివిక్రమ్ , వెంకటేష్ తో మూవీ చేయబోతున్నాడు అని వచ్చిన వార్తలు అన్ని పూర్తిగా అవాస్తవం అని , ప్రస్తుతం త్రివిక్రమ్ కేవలం అల్లు అర్జున్ సినిమాకు సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ పనుల్లోనే బిజీగా ఉన్నట్లు తెలుస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: