
శివన్నకి సౌత్ ఇండియా మొత్తం ఫ్యాన్స్ ఉన్నారు. అయితే స్టార్ హీరో శివ రాజ్‌కుమార్ ని అభిమానులు ముద్దుగా శివన్న అని కూడా పిలుస్తారు. ఈయన జైలర్ సినిమాతో మంచి క్రేజ్ ని సొంతం చేసుకున్నాడు. శివన్న కన్నడతో పాటు తెలుగులో కూడా పెద్ద పెద్ద సినిమాల్లో ముఖ్య పాత్రల్లో నటించారు. అయితే సడెన్‌గా శివన్నకి క్యాన్సర్ వచ్చి ఫారెన్ వెళ్లడంతో అభిమనులందరూ చాలా టెన్షన్ పడ్డారు. దీంతో ఇటీవలే తన ఫ్యాన్స్‌కి శివన్న ఓ వీడియోని రిలీజ్ చేసి శుభవార్త చెప్పారు.
ఆ వీడియోలో శివ రాజ్‌కుమార్ మాట్లాడుతూ.. తాను పూర్తిగా కోలుకున్నట్లు తెలిపారు. తనకి కిడ్నీ మార్పిడి ఆపరేషన్ జరిగిందంటూ వార్తలు వస్తున్నాయని.. అది నిజం కాదని అన్నారు. యూరినరీ బ్లాడర్‌కి సంబంధించిన చిన్న సర్జరీ జరిగిందని చెప్పారు. ఈ విషయంలో ఎవరు కన్ఫ్యూజ్ అవ్వొద్దు. కొన్ని రోజులు విశ్రాంతి తీసుకుని మార్చి నుంచి షూటింగులకి హాజరు కావచ్చని డాక్టర్లు చెప్పారని అన్నారు. త్వరలో జోష్‌తో తాను మళ్ళీ సినిమాలు చేస్తానని స్పష్టం చేశారు. అప్పుడు మళ్లీ ఆయన డ్యాన్సులు, ఫైట్లు చూసి అందరూ ఆశ్చర్యపోతారని తెలిపారు.