నాచురల్ స్టార్ నాని కొన్ని సంవత్సరాల క్రితం జెర్సీ అనే సినిమాలో హీరో గా నటించాడు. ఈ మూవీ లో శ్రద్ధా శ్రీనాథ్ హీరోయిన్గా నటించగా ... గౌతమ్ తిన్ననురి ఈ సినిమాకు దర్శకత్వం వహించాడు. ఈ మూవీ క్రికెట్ క్రీడా నేపథ్యంలో రూపొందింది. ఈ మూవీ 2019 వ సంవత్సరం ఏప్రిల్ 19 వ తేదీన విడుదల అయ్యి మంచి విజయాన్ని అందుకుంది. ఈ సినిమా విడుదల అయ్యి నిన్నటితో ఆరు సంవత్సరాలు పూర్తి అయింది. ఈ మూవీ విడుదల అయ్యి ఆరు సంవత్సరాలు కంప్లీట్ అయిన నేపథ్యం లో ఈ మూవీ కి ఆ సమయంలో ఏ ఏరియాలో ఏ రేంజ్ కలెక్షన్లు వచ్చాయి. మొత్తంగా వచ్చిన కలెక్షన్లు ఎన్ని ..? ఈ మూవీ కి ఎన్ని లాభాలు వచ్చాయి అనే వివరాలను తెలుసు కుందాం.

టోటల్ బాక్సా ఫీస్ రన్ కంప్లీట్ అయ్యే సరికి ఈ మూవీ కి నైజాం ఏరియాలో 9.55 కోట్ల కలెక్షన్లు దక్కగా , వైజాగ్ లో 2.75 కోట్లు , ఈస్ట్ లో 1.50 కోట్లు , వేస్ట్ లో 1.10 కోట్లు , కృష్ణ లో 1.60 కోట్లు , గుంటూరు లో 1.60 కోట్లు , నెల్లూరు లో 70 లక్షలు , సీడెడ్ లో 2.10 కోట్ల కలెక్షన్లు దక్కాయి. మొత్తంగా ఈ మూవీ కి రెండు తెలుగు రాష్ట్రాల్లో కలిపి 20.90 కోట్ల షేర్ కలెక్షన్లు దక్కాయి. ఇక యూ ఎస్ ఏ లో 4.55 కోట్లు , కర్ణాటక లో 1.75 కోట్లు , మరికొన్ని ప్రాంతాల్లో కలిపి 90 లక్షల కలెక్షన్లు వచ్చాయి. మొత్తంగా ఈ సినిమాకు ప్రపంచ వ్యాప్తంగా 28.1 కోట్ల షేర్ కలెక్షన్లు దక్కాయి. ఇకపోతే ఈ సినిమాకి దాదాపు 27 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది. ఈ మూవీ 28.1 కోట్ల షేర్ కలెక్షన్లను వసూలు చేసి బ్రేక్ ఈవెన్ ఫార్ములాను కంప్లీట్ చేసుకుని హిట్ స్టేటస్ను అందుకుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: