కోలీవుడ్ స్టార్ హీరోల లిస్టులో అజిత్ పేరు కూడా ముఖ్యంగా వినిపిస్తుంది. ఈ హీరోకి నటుడు విజయ్ కి మధ్య బాక్సాఫీస్ వార్ ఎక్కువగా ఉంటుంది. ఈ ఇద్దరు హీరోల అభిమానులకు కూడా అస్సలు పడదు. అయితే అలాంటి అజిత్ ఓవైపు సినిమాలు చేస్తూనే మరోవైపు కార్ రేసింగ్ లో పాల్గొంటూ ఆ మధ్యకాలంలో ఇండియాకి మెడల్ తీసుకువచ్చిన సంగతి మనకు తెలిసిందే.ఇదంతా పక్కన పెడితే తాజాగా అజిత్ షాలినిల పెళ్లిరోజుని గ్రాండ్ గా సెలబ్రేట్ చేసుకున్నారు.వీరిద్దరి పెళ్లి జరిగి దాదాపు 25 సంవత్సరాలు అవుతోంది. అజిత్ షాలినిల పెళ్లి ఏప్రిల్ 24, 2000 ల సంవత్సరంలో జరిగింది.అలా వీరి పెళ్లి జరిగి పాతిక సంవత్సరాలు ముగిసింది.అయితే పెళ్లయి25 సంవత్సరాలైనా కూడా ఈ జంట ఇప్పటికీ చాలా అన్యోన్యంగా ఉంటారు. 

అయితే వీరిద్దరి మధ్య ప్రేమ చిగురించింది అమరకల సినిమా షూటింగ్ సెట్లో. వీరి ప్రేమ పెళ్లి విషయం కాస్త పక్కన పెడితే అజిత్ శాలిని కంటే ముందే కొంతమంది హీరోయిన్ల ని ప్రేమించారు. ఇక అందులో ప్రముఖంగా వినిపించిన హీరోయిన్ పేరు హీరా రాజగోపాల్.. అజిత్ హీరా రాజగోపాల్ ల ప్రేమయణం అప్పట్లో కోలీవుడ్లో హాట్ టాపిక్. వీరిద్దరి ప్రేమ వార్తలు అప్పట్లో ఎక్కువగానే వినిపించాయి. అంతే కాదు డేటింగ్ కూడా చేశారనే రూమర్ ఉంది.కానీ వీరి మధ్య  ఏం గొడవ జరిగిందో ఏమో కానీ ఆ తర్వాత పెళ్లి చేసుకోలేదు. అయితే ఇండస్ట్రీ మొత్తం వీరిద్దరూ పెళ్లి చేసుకుంటారని ఆశగా ఎదురు చూసారు. కానీ సడన్గా వీరి మధ్య ఉన్న ప్రేమ బంధం తెగిపోయి బ్రేకప్ చెప్పుకున్నారు అనే రూమర్స్ వినిపించాయి. ఆ తర్వాత అజిత్ షాలినితో ప్రేమలో పడి ఆమెను పెళ్లి చేసుకున్నారు.

 కానీ హీరా రాజగోపాల్ అజిత్ తో ప్రేమాయణం తర్వాత తన కెరీర్ ని కూడా క్లోజ్ చేసుకుంది.ఎందుకంటే అజిత్ తో బ్రేకప్ తర్వాత 1999 నుండి ఈ హీరోయిన్ సినిమాలను కూడా పూర్తిగా మానేసి ఇండస్ట్రీకి గుడ్ బై చెప్పింది. అలా అజిత్ తో ప్రేమ బ్రేకప్ తర్వాత హీరా రాజగోపాల్ సినీ కెరియర్ మొత్తం క్లోజ్ అయిందని అప్పట్లో ఎంతో మంది మాట్లాడుకున్నారు. ఇక అజిత్ షాలినిలు పెళ్లి చేసుకున్నాక హీరా రాజగోపాల్ కూడా బిజినెస్ మ్యాన్ అయినటువంటి పుష్కర్ మాధవ్ ని 2002లో పెళ్లి చేసుకొని ఆ తర్వాత మనస్పర్ధలు రావడంతో 2006లో విడాకులు ఇచ్చేసింది. ఇక హీరా రాజగోపాల్ తెలుగులో కూడా కొన్ని సినిమాలు చేసింది. అలా నాగార్జునతో ఆవిడ మా ఆవిడే సినిమాలో టబుతో పాటు హీరా రాజగోపాల్ కూడా నటించింది.

మరింత సమాచారం తెలుసుకోండి: